Breaking News

ఐస్‌ వాటర్‌ తెగ తాగేస్తున్నారా? ఆగండాగండి! ఈ ఎఫెక్ట్స్‌ తెలుసా?

Published on Tue, 02/20/2024 - 16:52

ఇంకా మార్చి నెల రాకుండానే  వేడి సెగ తగులుతోంది.  రాత్రి పూట  ఫ్యాన్లు, ఏసీలు లేనిదే నిద్రపోలేని పరిస్థితి వచ్చేసింది.  ఇక  ఎండాకాలం అనగానే  ముందుగా గుర్తొచ్చేది చల్ల.. చల్లని నీళ్లు. వేడినుంచి  ఉపశమనం పొందేందుకు ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం అందరికీ అలవాటు.

చల్లటి నీళ్లు, లేదా ఇతర పానీయాలు కడుపులో పడగానే హాయిగా అనిపిస్తుంది. కానీ  అలా  ఐస్ వాటర్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి చేటు అని మీకు తెలుసా? వేసవిలో చల్లని నీరు త్రాగడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు గురించి తెలియాలంటే.. ఈ కథనాన్ని  చూడండి.

జీర్ణక్రియ సమస్యలు
 చల్లటి నీరు కడుపుని సంకోచింప చేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత ఆహారాన్ని జీర్ణం  కాదు కష్టమవుతుంది. మనం చల్లటి నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. అవును, చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి మనం చల్లటి నీరు తాగినప్పుడు, అది శరీర ఉష్ణోగ్రతతో సరిపోలక  కడుపులో ఉన్న ఆహారం జీర్ణం కష్టమవుతుంది.

హార్ట్ రేట్  తగ్గిపోతుంది
కొన్ని అధ్యయనాలు ప్రకారం చల్లని నీరు తాగడం గుండె స్పందన రేటు  కూడా తగ్గిపోతుంది.  మెడ మీద ఉండే గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్ చేసే వాగస్ నాడి  మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ నాడి శరీరం స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం.  అందుకే చల్లగా తిన్నా, తాగినా హార్ట్‌ రేట్‌  ప్రభావిత మవుతుంది. నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. 

సైనస్ , తలనొప్పి
అతి చల్లగా తాగడం వల్ల కూడా 'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్రీం అధికంగా తీసుకుంటే, వెన్నెముకకు సంబంధించిన  సున్నితమైన నరాలు కూడా చల్లగా అయిపోతాయి.   ఫలితంగా తలనొప్పి , సైనస్ సమస్యలొస్తాయి. 

మలబద్ధకం
చల్లటి నీరు తాగడం వల్ల పేగుల్లో ఆహారం గడ్డకడుతుంది. దీంతో మలబద్ధకం  సమస్య ఉత్పన్నమవుతుంది. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్ బుల్ లాంటివి కూడా వస్తాయి

కొవ్వును పెంచుతుంది
చల్లటి నీరు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును  మరింత గట్టిగా తయారు చేస్తుంది. ఒక పట్టాన కరగదు కూడా. సో.. బరువు తగ్గాలనుకున్న వారు  చల్లని నీటికి దూరంగా ఉండాలి. 

గొంతు నొప్పి
చల్లని నీరు, పానీయాల వల్ల ముఖ్యంగా భోజనం తర్వాత, అదనపు శ్లేష్మం (శ్వాసకోశ శ్లేష్మం) ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గొంతు నొప్పి, ముక్కు  దిబ్బడం  సమస్య వస్తుంది. ఇది ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.  ఇది ముదిరితే జ్వరం కూడా వస్తుంది. 

అంతేకాదు చల్లటి నీరు తాగడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి.  అందుకే కుండలోని నీళ్లు అయినా, ఫ్రిజ్‌ వాటర్‌ అయినా మరీ చల్లని నీళ్లు కాకుండా,   ఒక మాదిరివి తాగి, వేడినుంచి ఉపశమనం  పొందవచ్చు. లేదంటే   సమస్యలు తప్పవు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)