Breaking News

జుట్టును కాపాడుకోవడానికి ఈ ప్రొఫెషనల్‌ డ్రైయర్‌ ఉండాల్సిందే

Published on Mon, 09/11/2023 - 11:36

నిగారింపుతో ముఖం ఎంతగా మెరిసిపోయినా తల మీద తగినంత జుట్టు లేకపోతే ఆ అందం కళాహీనమే. అందుకే చాలామంది మహిళలు కేశసంరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. వారానికో హెయిర్‌ మాస్క్, రోజు విడిచి రోజు హెయిర్‌ మసాజ్‌లు.. ఇలా తమకు తెలిసిన పద్ధతిలో జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే  జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చెయ్యడం మంచిదంటారు నిపుణులు. నిజానికి తల స్నానం చేయడంతో పాటు జుట్టును ఆరబెట్టుకోవడమూ  కష్టమైన పనే.. బిజీ లైఫ్‌లో! అందుకే ఈ ప్రొఫెషనల్‌ ఎయిర్‌ డ్రైయర్‌ ఇంట్లో ఉండాల్సిందే!

చిత్రంలోని ఈ డివైస్‌.. గిరిజాల జుట్టు.. మందపాటి జుట్టు.. ఇలా అన్ని రకాల జుట్టుకూ ప్రయోజనం కలిగిస్తుంది. ఆన్, ఆఫ్, హై, లో అనే ఆప్షన్స్‌తో దీన్ని వినియోగించడమూ తేలికే! నెగెటివ్‌ అయానిక్‌ టెక్నాలజీతో కూడిన ఈ హెయిర్‌ డ్రైయర్‌.. భారీ ప్రతికూల అయాన్‌లను విడుదల చేయడంతో జుట్టులోని తేమను పోగొట్టి.. మృదువుగా మారుస్తుంది. జుట్టును  కాపాడుతుంది. ఈ సాధనం చాలా తేలికగా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు.

ఇది స్టెయిలింగ్‌ ఫ్లెక్సిబిలిటీతో పాటు.. కంట్రోల్‌ కోసం 2 విభిన్న స్పీడ్‌ మోడ్‌లను అందిస్తుంది. అలాగే ఇందులోని రెండు ప్రత్యేకమైన హెడ్స్‌ని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆటోలీకేజ్‌ సంరక్షణ కోసం సేఫ్టీ ప్లగ్‌తో.. ఈ డ్రైయర్‌ అప్‌గ్రేడ్‌ అయ్యింది. దాంతో దీన్ని ఉపయోగించినప్పుడు షార్ట్‌ సర్క్యూట్‌ లేదా విద్యుత్‌ లీకేజీ జరిగితే.. ఓవర్‌–హీట్‌ ప్రొటెక్షన్‌లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్‌ అవుతాయి. ధర 35 డాలర్లు. అంటే 2,894 రూపాయలు.

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)