Breaking News

మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్‌ దొరికిందహో!

Published on Thu, 02/20/2025 - 10:19

పెంచుకున్న కుక్క కనిపించకపోతే ఏం చేస్తాం? తిరగాల్సిన చోటుకల్లా తిరుగుతాం. పోలీస్‌ కంప్లాయింట్‌  ఇస్తాం. అయినా ఫలితం లేకపోతే ప్రియమైన శునకాన్ని తలచుకొని బాధ పడడం తప్ప ఏంచేయగలం? కాని గురుగ్రామ్‌కు చెందిన దీపయాన్‌ ఘోష్, కస్తూరి దంపతులు మాత్రం ఏమైనా సరే, ఎక్కడున్నా సరే... తప్పిపోయిన తమ పెంపుడు శునకాన్ని వెదికి పట్టుకోవాల్సిందేనని గట్టిగా డిసైడైపోయారు.

శునకం కనిపించని రోజు నుంచి వారికి నిద్ర, తిండి లేవు. కుక్క జాడ చెప్పిన వారికి యాభై వేల రివార్డ్‌ ప్రకటించడంతో సహా ఇంటింటికీ  వెళ్లి శునకం ఆనవాళ్ల గురించి చెప్పడం, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించడం, డ్రోన్‌ నిఘా...ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

‘ఇంత కష్టం అవసరమా?!’ అని ఎంతోమంది అన్నారు. అయినా సరే కుక్క కోసం వెదకడం ఆపలేదు. ఎట్టకేలకు వారి అలుపెరగని గాలింపుకు ఫలితం దక్కింది. తాజ్‌మహల్‌ సమీపంలోని అడవిలో సంచరిస్తున్న గ్రేహౌండ్స్‌ను కనుగొన్నారు. దీపయాన్, కస్తూరి దంపతులు సెలవు రోజుల్లో ఆగ్రాకు వెళ్లారు. వూఫ్, గ్రేహౌండ్స్‌ అనే పెంపుడు కుక్కలను కూడా వెంట తీసుకెళ్లారు. ఫతేపూర్‌ సిక్రీని సందర్శిస్తున్న సమయంలో....‘గ్రేహౌండ్స్‌ కనిపించడం లేదు’ అని తాము బస చేసిన హోటల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.

ఎలాగైనా గ్రేహౌండ్స్‌ ఆచూకి కనుక్కోవాలని అనుకున్న దీపయాన్, కస్తూరి దంపతులు రెండు వారాలపాటు ఆగ్రాలోనే ఉండి పోస్టర్లు వేస్తూ, బ్యానర్లు కడుతూ ఎన్నో ప్రాంతాలు తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. గురుగ్రామ్‌కు తిరిగి వచ్చిన తరువాత కూడా తరచు ఆగ్రాకు వెళ్లేవారు. ఆటోలపై, దుకాణాలు, మెట్రో స్టేషన్‌ల దగ్గర ‘కనిపించడం లేదు’ అనే ప్రకటనలు అంటించేవారు. 

వారి ప్రచారం సోషల్‌మీడియాకు కూడా చేరింది. దీంతో యానిమల్‌ రెస్క్యూ గ్రూప్‌లు, వాలెంటీర్‌లు కూడా రంగంలో దిగారు. ఒకానొక రోజు గ్రేహౌండ్‌ను చూసిన టూర్‌ గైడ్‌ ప్రశాంత్‌ జైన్‌ నుంచి దంపతులకు ఫోన్‌ వచ్చింది. అలా కథ సుఖాంతం అయింది. మూడు నెలల తరువాత గ్రేహౌండ్స్‌ తన పెంపుడు పేరెంట్స్‌ దగ్గరికి చేరుకుంది. 

(చదవండి: ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)