గూగుల్ ఉన్నప్పుడు... గురువు అవసరమా?

Published on Wed, 07/29/2026 - 10:09

ఒక సందేహం వస్తే చాలు... చేతిలోని ఫోన్ తీసి గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. ఇంకా కాస్త వివరంగా కావాలంటే AIని అడుగుతున్నాం. పుస్తకాల నుంచి క్లాస్‌రూమ్‌ల వరకు అన్నీ డిజిటల్ అవుతున్న కాలమిది. మరి ఇలాంటి రోజుల్లో గురువు అవసరం ఏముంది? అంటే.. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా దీని గురువు ఆవశ్యకత గురించి సవివరంగా చూద్దామా. అంతేకాదండోయ్‌ దీని గురించి సోషల్ మీడియా మాత్రం దీనికి ఓ ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్... ఏ వేదిక చూసినా ఒకే దృశ్యం. పాత స్కూల్ టీచర్‌తో దిగిన ఫొటో, కాలేజీ లెక్చరర్‌తో ఉన్న సెల్ఫీ, "మీరు లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు సార్", "హ్యాపీ గురు పౌర్ణమి మేడమ్" అంటూ పోస్టులు, వీడియోలు, జ్ఞాపకాలు. కొందరు ఏళ్ల తర్వాత తమ గురువులను నేరుగా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మరికొందరు తమ విజయాన్ని గురువులకు అంకితం చేస్తున్నారు. ఇది ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. సమాచారం కోసం గూగుల్‌ను ఆశ్రయించొచ్చు. కానీ జీవితానికి దిశ చూపిన వ్యక్తిని మాత్రం మనసు ఎప్పటికీ మర్చిపోదు.

అవి గురువు దగ్గరే నేర్చుకోగలం..
గూగుల్ సమాచారం ఇస్తుంది. AI సమాధానం చెబుతుంది. కానీ ఆ సమాధానాన్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో చెప్పేది గురువే. ఒక సబ్జెక్ట్ నేర్పడం కంటే ఎక్కువగా, ఓటమిని ఎలా ఎదుర్కోవాలి, విజయం వచ్చినప్పుడు ఎలా ఒదిగి ఉండాలి, మన సామర్థ్యాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలు గురువు దగ్గరే నేర్చుకుంటాం.

అందుకే గురువు అంటే కేవలం పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. జీవితంలో సరైన సమయంలో సరైన మాట చెప్పి దారి చూపిన ప్రతి ఒక్కరూ గురువులే. తల్లిదండ్రులు, కోచ్‌లు, సీనియర్లు, జీవితంలో స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు కూడా ఆ స్థానంలో నిలుస్తారు.

AI ఎంత అభివృద్ధి చెందినా అది అనుభవాన్ని సృష్టించలేదు. గూగుల్ ఎంత వేగంగా సమాధానం ఇచ్చినా అది మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దదు. అందుకే సాంకేతికత ఎంత ముందుకు వెళ్లినా గురువు విలువ తగ్గలేదు. పైగా డిజిటల్ యుగంలో మంచి గురువు అవసరం మరింత పెరిగింది. ఎందుకంటే సమాచారం అపారంగా ఉన్న ఈ కాలంలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఉపయోగకరం అనే వివేకం నేర్పించేది గురువే.

గురు పౌర్ణమి కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఈ రోజు కేవలం సంప్రదాయ పూజలు చేసే రోజు మాత్రమే కాదు. మన జీవితంలో వెలుగు నింపిన వ్యక్తిని ఒక్కసారి గుర్తు చేసుకునే రోజు. చిన్నప్పుడు చేతి వేళ్లు పట్టుకుని అక్షరాలు దిద్దించిన గురువు నుంచి, జీవితంలో కష్టకాలంలో ధైర్యం చెప్పిన వ్యక్తి వరకు... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత చెప్పే సందర్భం.

టెక్నాలజీ కాలాన్ని మార్చింది. నేర్చుకునే పద్ధతిని మార్చింది. కానీ గురువు స్థానాన్ని మాత్రం మార్చలేకపోయింది. అందుకే గూగుల్, AIల యుగంలో కూడా గురు పౌర్ణమి ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ప్రతి విజయకథ వెనుక కనిపించని ఒక గురువు ఉంటాడు.

"గూగుల్ జవాబులు ఇస్తుంది... గురువు జీవితాన్ని మార్చే ప్రశ్నలు అడగడం నేర్పిస్తాడు. అందుకే గూగుల్ ఉన్నా... గురువు అవసరమే".

(చదవండి: హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్‌ అంతే..)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)