Breaking News

అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్‌ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!

Published on Fri, 10/20/2023 - 16:59

ప్రపంచంలోనే అ‍త్యంత ఘాటైన మిరపగా పెప్పర్‌ ఎక్స్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. ఇంతవరకు అత్యంత ఘాటైన మిరపగా ఉన్న కరోలినా రీపర్‌ చిల్లి పెప్పర్‌ని వెనక్కి నెట్టి మరీ ఈ పెప్పర్‌ ఎక్స్‌ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘాటైన మిరపకాయను మిచిగాన్‌కి చెందిన స్మోకిన్‌ ఎడ్‌ క్యూరీ రూపొందించారు. ఈ మిరపకాయను ఒక్కటి తిన్నా ఇక అంతే సంగతులు. తిన్న తర్వాత ఏకంగా మూడు గంటల పాటు గొంతు నాలుక మంటగా ఉంటాయట. మిరపకాయలలో క్రియాశీలకమైన భాగం అయిన క్యాప్సైసిన్ అనే విత్తనాలతో కూడిన భాగం తిన్న వెంటనే ఘాటుగా ఫీలయ్యే అనుభూతి కలుగుతుంది. మిరపకాయ ఘాటును స్కోవిల్లే హీట్ యూనిట్‌లో కొలుస్తారు.

ఆ యూనిట్‌లో ఈ పెప్పర్‌ ఎక్స్‌ మిరకాయ ఘాటు ఏకంగా 2.69 మిలియన్లుగా నమోదైంది. జనాన్ని చెదరగొట్టడానికి వినియోగించే పెప్పర్‌ స్ప్రెని సైతం ఓడించింది. దీని ఘాటు 1.6 మిలియన్లు స్కోవిల్లే హీట్‌. ఈ స్ప్రే వల్ల ఒక్కోసారి కళ్లు పోతాయి. అంతకు మించి పవర్‌ఫుల్‌ అయిన ఈ పెప్పర్‌ ఎక్స్‌ మిరపని సరదాకి కూడా తినేందుకు ఎవ్వరూ యత్నించే సాహసానికి దిగలేరని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. ఈ మేరకు ఈ మిరపకాయను సృష్టించిన క్యూరీ మాట్లాడుతూ..తాను జన్యు శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, వృక్ష శాస్త్రాన్ని కవర్‌ చేసి మరీ ఈ ఘాటైన మిరపకాయని సృష్టించినట్లు తెలిపారు.

తాము కరోలినా రీపర్‌ చిల్లీని క్రాస్‌ బ్రీడింగ్‌ చేసి మరీ ఈ పెప్పర్‌ ఎక్స్‌ మిరపను సృష్టించినట్లు క్యూరీ తెలిపారు. క్యూరీ పదేళ్ల పాటు సాగు చేసి మరీ ఈ ఘాటైన మిరపను రూపొందించాడు.  ఈమేరకు క్యూరీ యూట్యూబ్ సిరీస్, "హాట్ వన్స్" ఎపిసోడ్‌లో తాను సాగు చేసిన ఈ  పెప్పర్ఎక్స్‌(x) గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ప్రస్తుతానికి మాత్రం పెప్పర్ ఎక్స్‌తో తయారు చేసిన హాట్ సాస్‌లు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక  పెప్పర్‌ ఎక్స్‌ రుచి గురించి ఇన్‌స్టాగ్రాం వేదికగా ఐదుగురు సెలబ్రెటి వ్యక్తులను పిలిపించి మరీ వివరించాడు. వారంతా ఈ మిరపను తిన్నా ఆయా సెలబ్రిటీలు అబ్బా...అంటూ దీని ఘాటు గురించి వేర్వేరు విధాలుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా)

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)