Breaking News

అతిథి... అనుబంధాల అక్షయపాత్ర!

Published on Mon, 08/03/2026 - 00:35

ఈ అనంత విశ్వ గమనంలో మానవుడు కేవలం ఒక వ్యక్తి కాదు, అతడొక సామాజిక అనుబంధాల సంగమ స్థానం. భారతీయ జీవన వేదంలో ఆతిథ్యం అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది ఒక అనురాగ మంత్రం. మన సంస్కృతి విశ్వానికి అందించిన మహోన్నత సందేశం ‘అతిథి దేవో భవ’. అంటే గడప తొక్కిన వ్యక్తిని దైవ స్వరూపంగా దర్శించడం. 

ఆతిథ్యం, ఉపకారం– ఈ రెండూ ఉన్నతోన్నత సంస్కారానికి నిలువెత్తు తార్కాణాలు. ఒకరికి ఆతిథ్యమిచ్చే అవకాశం రావడం, మరొకరికి ఉపకరించే సందర్భం దొరకడం అనేది మనిషి చేసుకున్న గొప్ప అదృష్టం. పరిచయం లేని వ్యక్తిని కూడా ఆత్మీయంగా అక్కున చేర్చుకోగల ఈ గుణమే సామాన్యుడిని సైతం ‘మనీషి’గా రూపాంతరం చెందిస్తుంది.

శ్రీరామచంద్రుని అచంచలమైన ప్రేమను పొందిన నిషాదరాజు గుహుడి గాథ ఇందుకు ఒక అద్భుత నిదర్శనం. రాజభోగాలను వదిలి కారడవుల పాలైన రాముడిని, గంగా తీరంలో గుహుడు సాదరంగా ఆహ్వానించాడు. అది రాజకోటలో దొరికే విందు కాదు, ఒక సామాన్య అడవి బిడ్డ హృదయం నుండి ఉబికిన ఆత్మీయ ఆలింగనం. ఆ కష్టకాలంలో గుహుడు అందించిన నిస్వార్థమైన ఆతిథ్యాన్ని, ఆత్మీయమైన ఉపకారాన్ని రాముడు తన జీవితాంతం మరువలేదు. 

అందుకే అయోధ్యకు తిరిగి వెళ్లే సమయంలోనూ, గుహుడు నా ‘ఆత్మసఖుడు’ అని పలికి, హనుమంతుడి ద్వారా ప్రత్యేకంగా క్షేమవార్తలు పంపాడు. ఆటవికుడైనా సరే, ఆతిథ్యమనే ఉత్తమ మనస్తత్వం ఉంటే సాక్షాత్తు ఆ పరమాత్ముని హృదయంలోనే శాశ్వత స్థానం సంపాదించుకోవచ్చని గుహుడు నిరూపించాడు. పదార్థం ఏమున్నదనేది కాదు, పరిమళించే భావం ఏమిటనేదే ఆతిథ్యపు పరమార్థం.

‘వసుధైవ కుటుంబకం’ అనేది మన నినాదం మాత్రమే కాదు, అది మన ఆత్మగౌరవం. ఆతిథ్యం కేవలం ఆహారాన్ని అందించడం కాదు, ఆత్మీయతను పంచడం. అలసిపోయిన బాటసారికి చెట్టు నీడ ఎంతటి సేదను ఇస్తుందో, ఆపదలో ఉన్న గుండెకు మన ఆత్మీయమైన పలకరింపు అంతటి ప్రాణవాయువును అందిస్తుంది. 

ఎదుటివారికి ఉపకరించే స్థితిలో మనం ఉన్నామంటే, అది మన శక్తి కాదు.. మనకు లభించిన ఒక దివ్యమైన అవకాశం. వైఫల్యం ఎదురైనప్పుడు మనల్ని రక్షించేది మన సంపద కాదు, మనం సంపాదించుకున్న నమ్మకమైన గుండెలే. చీకటిలో తోడుండే నీడలా, ఎడారిలో దొరికే సెలయేరులా ఆత్మీయ బంధాలు మనిషిని బతికిస్తాయి.

ఆత్మీయత లేని విందు ఆత్మ లేని శరీరం వంటిది. మన గడప తొక్కే ప్రతి అతిథిలో ఆ పరమాత్మను దర్శిద్దాం, ప్రతి ఉపకారంలోనూ సార్థకతను వెతుక్కుందాం. మానవత్వమే మార్గంగా, మమకారమే ప్రాణంగా లోకకల్యాణం కోసం అడుగులు వేద్దాం.

లోపల అహంకారం లేని ఆత్మీయతే ఈ ప్రపంచాన్ని నడిపే ఇంధనం. గూడు లేని పక్షికి కొమ్మ ఆసరా అయినట్లు, గమ్యం తెలియని ప్రయాణికుడికి మన ఆత్మీయత ఒక వెలుగు బాట కావాలి. సముద్రపు అలలు తీరాన్ని తాకినట్లు, మన ప్రేమ ఎదుటివారి హృదయాన్ని తాకాలి. అపరిచితులను కూడా ఆత్మీయులుగా మార్చుకోగల గుణమే మన భారతీయతకు అసలైన సంతకం.

– కె. భాస్కర్‌ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)