Breaking News

ఐఐటీ స్టూడెంట్‌ కాదు.. కానీ ఏకంగా రూ..4.8 లక్షలు..!

Published on Mon, 08/03/2026 - 10:41

మనం ఐఐటీ వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తేనే మంచి ప్యాకేజీ ఆఫర్లతో ఉద్యోగాలు చేస్తారని అనుకుంటాం. సర్వసాధారణంగా అందరూ ఇలానే భావిస్తారు. బాగా చదివి రాణిస్తే..లక్షల్లో వేతనం అని అందరూ విశ్వసిస్తుంటారు. కానీ అదొక ట్యాగ్‌ మాత్రమేనని, అంత పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా.. ఆ రేంజ్‌లో డబ్బులు సంపాదించొచ్చనని ఈ వ్యక్తి నిరూపించాడు.

అతడే 22 ఏళ్ల లావణ్య జైన్‌. ఆయన తాను ఐఐటీ స్టూడెంట్‌ కాకపోయినా..ఆ రేంజ్‌లో ఎలా వేతనం ఆర్జిస్తున్నాడో అకౌంట్‌ స్క్రీన్‌ షార్ట్‌లతో సహా సోషల్‌ మీడియాలో ఎక్స్‌లో పంచుకున్నారు. తన కాలేజ్‌ ప్లేస్‌మెంట్‌ ప్యాకేజీ కంటే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు తెలిపారు. అలాగే తన బీటెక్ డిగ్రీని కూడా మధ్యలో వదిలేశానని అన్నారు. 

తన చివరి సెమిస్టర్‌లో ఇంజనీరింగ్‌ని వదిలేశానని అన్నారు. పైగా దాన్ని అతడు తన జీవింతంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా పేర్కొనడం విశేషం. తనకు వేర్వేరు మార్గాల్లో ఆదాయ వనరులు ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆదాయం ఖర్చులకు సరిపోగా, మిగతావి పొదుపు చేస్తున్నట్లు తెలిపారు. ఆ పోస్ట్‌లో స్క్రీన్‌షాట్‌లలో అకౌంట్‌లో రెండు చెల్లింపు జమ అయినట్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి రూ. 3.74 లక్షలు , మరొకటి రూ. ₹1.12 లక్షలు. రెండూ కలిపి రూ. 4.8 లక్షలు అయ్యాయి. 

తాను ఒక పక్క పార్ట్‌టైమ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూనే..రనబుల్, కైరోస్ కంప్యూటర్ అండ్‌​ ఫోల్డ్ వంటి స్టార్టప్‌ల గ్రోత్‌ అండ్‌ గో-టు- మార్కెట్‌(జీటీఎం) విభాగాలలో పనిచేస్తూ..ఇంతలా డబ్బులు ఆర్జిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ గొప్పలు చెప్పుకోవడానికి ఉద్దేశించింది కాదని, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థ నుంచి పట్టభద్రులైతేనే విజయం సాధ్యమనే భావనను సవాలు చేసేందుకుని ఈ మార్కెటింగ్‌ నిపుణుడు లావణ్య జైన్‌ చెప్పారు. 

ఐఐటీలో చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను అంగీకరిస్తూనే, వృత్తిపరమైన విజయం అనేది చివరికి ఒక వ్యక్తి సాధించే దానిపైనే ఆధారపడి ఉంటుందని వాదిస్తున్నాడు. చివరగా ఆయన ఐఐటీ చేస్తేనే లక్షల్లో వేతనం అనేది కేవలం అపోహేనని, ఉద్యోగంలో ఉన్నతంగా ఎదగాలనే ఆకాంక్ష ఆ రేంజ్‌లో డబ్బులు ఆర్జించే స్థాయికి తీసుకొస్తుందంటూ తన పోస్ట్‌ని ముగించారు. ఏదీఏమైన ఈ వ్యక్తి పోస్ట్‌ కెరీర్‌ విజయానికి నిజంగా ఉన్నత కాలేజీ డిగ్రీలే ముఖ్యమా? అనే అంశంపై చర్చను లేవనెత్తింది.

 

(చదవండి: నో రన్నింగ్‌, నో కార్డియో..! జస్ట్‌ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)