Breaking News

Vanajeevi Ramayya వనజీవికి వినూత్న నివాళి!

Published on Wed, 04/16/2025 - 12:45

సాక్షి, సిటీబ్యూరో: జీవితాంతం హరిత విప్లవానికి అంకితమై విశేష కృషి చేసిన ‘వనజీవి’ పద్మశ్రీ దరిపల్లి రామయ్య స్మరణార్థం నగర శివారులోని ప్రముఖ ఏఐ ఆధారిత సర్వైలెన్సెస్‌ ఈ–సెక్యూరిటీ సిస్టమ్స్‌ సంస్థ బృహస్పతి టెక్నాలజీస్‌ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. జీవితాంతం మొక్కలు పెంచుతూ, పర్యావరణ సంరక్షణ కోసం పాటు పడిన వనజీవి రామయ్యకు నివాళిగా వెల్జెర్ల వేదికగా 100 మందికి పైగా బృహస్పతి టెక్నాలజీస్‌ ఉద్యోగులు, స్థానిక రైతులు పాల్గొని మొక్కలు నాటుతూ రామయ్యను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏకకాలంలో 600కు పైగా మొక్కలు నాటుతూ భవిష్యత్‌ కార్యాచరణను ప్రారంభించామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ పాపోలు తెలిపారు. 

ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై విజ్ఞానం పెంచేందుకు విశేషంగా పనిచేసిన ఉద్యోగులను ప్రోత్సహించడమే లక్ష్యంగా వారిని ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందించారు. ప్రతి పౌరుడూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని రామయ్య చెప్పకనే చెప్పారని గుర్తు చేశారు. ఈ మొక్కలు నాటడంలో పద్మశ్రీ దరిపల్లి రామయ్య సేవలు తమకు ప్రేరణ అని, ఈ ప్రయత్నంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్పొరేట్‌ సంస్థగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఉద్యోగుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంచడమే కాదు, పనితో వచ్చే ఒత్తిడిని కూడా తగ్గించవచ్చన్నారు. సస్టెయినబిలిటీ, సామాజిక బాధ్యతగా ఈ వినూత్న కార్యక్రమం సామాజిక విప్లవంగా మారాలని అన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)