Breaking News

Dr. Velaga Venkatappaiah గ్రంథాలయ గాంధీ

Published on Wed, 06/11/2025 - 11:14

జీవితాన్ని గ్రంథాలయోద్యమానికి ధారపోసిన గ్రంథాలయ సారథి, పుస్తక సంపాదకుడు, బాలసాహితీవేత్త, ఎందరో బాల సాహితీవేత్తలను ప్రోత్సహించి, వారు పుస్తకాలు రాసే అవకాశం కల్పించిన సహృదయుడు, ‘గ్రంథాలయ గాంధీ’ వెలగా వెంకటప్పయ్య (Dr. Velaga Venkatappaiah) గ్రంథాలయ గాంధీ . జూన్‌ 12వ తేదీన వీరివర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో ఆయనకాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలు యువతకు తెలియవల సిన అవసరం ఎంతైనా ఉంది. 1932లో తెనాలి ఐతానగర్‌లో జన్మించారు. గ్రంథాలయంలో చిరుద్యోగిగా జీవితం ఆరంభించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పొందిగ్రంథాలయ శాఖలో  వివిధ పదవులు నిర్వహించారు. 

17 ఏళ్ల వయస్సులోనే 1949లో ‘బంగారు బొమ్మ’ పేరుతో బాలల కథల సంపుటిని ప్రచురించి పిల్లలకు అందించారు. పిల్లల కోసం 1958లో ‘టెలిఫోన్‌’, 1959లో ‘రేడియో’, 1962లో ‘కాగితం కథ’ వంటి పుస్తకాలు రాశారు. 30 వేల తెలుగు సామెతలు, వేయి తెలుగు బాలల జానపద గేయాలు, 3 వేల పొడుపు కథలు, 15 వేల జాతీయాలు సేకరించి ప్రచురించారు. 2013లో ‘అందరూ మహానుభావులే’ పేరుతో 1024 పేజీలతో అన్ని రంగాల ప్రముఖుల పరిచయాలతో కూడిన బృహత్తరగ్రంథానికి సంపాదకత్వం వహించారు. 

2014లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాలసాహిత్య కథల సంకలనానికి సంపాదక బాధ్యతలు వహించారు. గ్రంథాలయ విజ్ఞానంలో ఆయన తాకని అంశం లేదు. వందకు పైగా  పుస్తకాలు, ముఖ్యంగా గ్రంథాలయ విజ్ఞానానికి సంబంధించి రాసినగ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. వీరు కాకతీయ విశ్వవిద్యాలయా నికి సర్టిఫికెట్‌ కోర్సుకు ఆరు పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు. 1990లో ఉద్యోగ విరమణ చేసి రచనా వ్యాసంగంలోనే నిమగ్నమయ్యారు. 2013లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని గ్రంథా లయ రంగం నుండి అందుకున్న తొలి వ్యక్తి డా‘‘ వెలగా. జీవిత కాలాన్ని గ్రంథాలయ ఉద్యమాలు, బాల సాహిత్యం కోసం అంకితం చేసిన  వెలగా వెంకటప్పయ్య తన 82వ ఏట 2014 డిసెంబర్‌ 29న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సేవలు చిరస్మరణీయాలు.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని, తెనాలి
(రేపు తెనాలిలో డా‘‘ వెలగా వెంకటప్పయ్య కాంస్య విగ్రహ ప్రతిష్ఠ)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)