Breaking News

మద్యంపై పోరులో మహిళల విజయం..!

Published on Wed, 10/23/2024 - 10:35

ముంబై ప్రాంతంలోని హెచ్‌ఎస్‌జి కాంప్లెక్స్‌లోని బూజ్‌ షాప్‌ తెరవద్దంటూ మహిళలు అడ్డుపడి, విజయం సాధించారు. కొందరు మద్యం ప్రియులు షాపింగ్‌ కాంప్లెక్స్‌ పరిసరాలలో తాగి,  చుట్టుపక్కల అమ్మాయిలు, మహిళల పట్ల చులకన వ్యాఖ్యల చేయడం వల్ల తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసేయాలని స్థానిక మహిళలు పట్టుబట్టారు. ఎంకే హెరిటేజ్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ పురుషులు, పిల్లలు కూడా ఆ మహిళలతో జత కలవడంతో అందరూ కలసి మానవ హారంగా ఏర్పడి మౌన నిరసనను తెలియజేశారు.

ఈ నిరసన ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన వీరు కలెక్టర్‌ కార్యాలయానికి, ముఖ్యమంత్రికి ఇ–మెయిల్‌ ద్వారా తమ సందేశాన్ని పంపారు. ముఖ్యంగా మహిళల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసివేయకపోతే స్థానిక ప్రజలు శాంతిభద్రతల సమస్యలను ఎంతగా ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ 50 మందికి పైగా మహిళలు ఒక మెమోరాండంపై సంతకం చేసి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు పంపారు. 

ఫలితంగా సీఎం నుంచి కలెక్టర్, ఎక్సైజ్‌ శాఖ, సంబంధిత అన్ని శాఖలకు ఈ సమస్యపై దర్యాప్తు చేయమని రాయగడ్‌ డివిజన్‌కు ఆదేశాలు అందాయి. ప్రతిపాదిత దుకాణం ప్రసిద్ధ సాయిబాబా ఆలయ ప్రవేశ ద్వారం నుంచి 144 మీటర్ల దూరంలో ఉందని, ప్రముఖుల విగ్రహాలు, విద్యాసంస్థలు, సమీపంలోని రాష్ట్ర రహదారి వంటి ఇతర అడ్డంకులు లేవని ఎక్సైజ్‌ శాఖ బృందాలు నివేదించాయి. 

అయినప్పటికీ స్థానికంగా ఉన్న సమస్యను పరిగణనలోకి తీసుకొని, ఇక్కడ ఉన్న మద్యం షాప్‌ను మరో భవనంలోకి మార్చాలని నిర్ణయించారు. దీంతో మద్యంపై పోరులో మహిళల సాధించిన విజయంగా అందరిని దృష్టిని ఆకర్షించడమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది.  

(చదవండి:

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)