Breaking News

కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!

Published on Sat, 07/29/2023 - 12:12

ప్రస్తుతం చాలా మంది చేతులు, తుంటి, వెన్నెముక, మోకాళ్లు, కీళ్లలో నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో యూరిక్‌ యాసిడ్‌ పెరగడం కారణంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యల బారిన పడుతున్నారు. వ్యాయామాలు చేయడం కారణంగా ఈ నొప్పులు తీవ్ర తరమవుతున్నాయి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్‌నట్స్‌ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్‌ ఉ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. ఎక్కువగా వినియోగించడం వల్ల కీళ్లనొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజు తినడం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెర్రీల వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్‌ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కూరగాయలు సల్ఫోరాఫేన్‌ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా యూరిక్‌ యాసిడ్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బ్రోకలీ, కాలీఫ్లవర్‌లను ఆహారంలో తీసుకోవాలి.
 

ఆలివ్‌ ఆయిల్‌ కీళ్ల నొప్పులున్నవారు ఆలివ్‌ ఆయిల్‌ను వినియోగించి తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మార డంతోపాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 

డార్క్‌ చాక్లెట్‌ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

(చదవండి:  దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్‌ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)