Breaking News

ఈ కప్పలు మనుషుల్ని చంపేస్తాయని మీకు తెలుసా?

Published on Tue, 07/04/2023 - 16:44

ఈ భూమ్మీద  ఎన్నో రకాల విష జంతువులు ఉన్నాయి.విషపూరీతమైనవి అంటే ముందుగా గుర్తొచ్చేవి పాములు. అయితే విషపూరిత కప్పల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటి కప్పలు కూడా అంత ప్రమాదకరమా అని ఆలోచిస్తున్నారా? అవును.. అలాంటి విషపూరితమైన కప్పలు కూడా ఉన్నాయి. చూడటానికి అందంగా కనిపించే ఈ కప్పలు యమ డేంజర్‌. వీటిని గోల్డెన్‌ పాయిజన్‌ కప్పలు అని అంటారు. వీటికి ఒళ్లంతా విషమే. ఆఖరికి ఈ కప్పలను ముట్టుకున్నా శరీరం విషపూరితమవుతుంది.

► ఈ పాయిజన్‌ కప్పలు కొలంబియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా రెండు అంగుళాలు లేదా కాస్త పెద్దగా ఉండే ఈ కప్పలో పదిమందిని చంపేంత విషం ఇందులో ఉంటుంది. శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట.
 
► ఈ కప్పలను తాకినా ప్రాణాలు పోతాయట. పొరపాటున వీటిని టచ్‌ చేసినా చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కప్పల విషం నేరుగా చర్మంపై పడినా పల్స్‌ రేటు వెంటనే పడిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. 

 
► ఈ కప్పలు పసుపు, నారింజ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రదేశాన్ని బట్టి అవి వాటి రంగులను మార్చుకుంటాయి. 

► ఒళ్లంతా విషాన్ని నింపుకున్న ఈ కప్పలను వైద్య రంగంలో ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దీనిలోని విషాన్ని కొన్ని కెమికల్‌ పద్దతులను ఉపయోగించి పెయిన్‌ కిల్లర్స్‌ను తయారు చేసేందుకు రీసెర్చ్‌ చేస్తున్నారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)