Breaking News

చేతులు లేవు కానీ పెయింటింగ్‌లో ప్రపంచ రికార్డు..!

Published on Fri, 03/13/2026 - 16:02

కొందరి ప్రతిభ అసాధారణంగా బయటకొస్తుంది. సాధారణంగా చిత్ర కళాకారులు ప్రయాణం చేతిలో పెన్సిల్‌ పట్టుకోవడంతో ప్రారంభమవుతుంది. కానీ కొందరి విధివంచితులకు ఆ అవకాశమే లేకుండా చేసి వెక్కిరిస్తుంటుంది. అయినప్పటికీ వారి కళా ప్రయాణం ఆగదు..పైగా విభిన్న ప్రతిభపాటవంతో ప్రపంచమే చేతులెత్తి సలాం కొట్టేలా చేస్తారు. అంతేగాదు అసాధారణ ధృడ సంకల్పం ముందు ఎంతటి వైకల్యమైన వెలవెలబోవాల్సిందే..!. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు.

ఆ యువకుడే చత్తీస్‌గఢ్‌కు చెందిన గోకరణ్ పాటిల్. పుట్టుకతో చేతులు, వినికిడి లోపంతో జీవిస్తున్న వ్యక్తి శక్తిమంతమై సృజనాత్మక వ్యక్తీకరణ రూపంగా మారాడు. గోకరణ్ పాటిల్ చత్తీశ్‌గఢ్‌లోని భిలాయ్‌లో పెరిగాడు. అక్కడ అతను తన తల్లి, తోబుట్టువులతో పెరిగాడు. రోజువారీ పనులకు అతడి శారీరక లోపాలు పెను సవాళ్లుగా మారాయి. అయినప్పటికీ పాటిల్‌ వెనక్కి తగ్గలేదు. అలా పాఠశాలలో చదువుకుంటున్నప్పుడూ అందరిలా చేతితో పెన్సిల్‌ పట్టుకోలేకపోతేనేం.. కాళ్లు ఉన్నాయి కదా అని అనుకున్నాడు పాటిల్‌. అలా కాలి వేళ్ల మధ్య పెన్సిల్‌ పట్టుకుని రాయడం ప్రారంభించాడు. 

అతనికి తన పాదాలపై ఉన్న అద్భుతమైన నియంత్రణకు ఉపాధ్యాయులు అబ్బురపడి..డ్రాయింగ్‌ వేసే దిశగా ప్రోత్సహించారు. దాంతో పాటిల్‌ ఆ మార్గంలోనే గట్టిగా సాధన చేశాడు. కాలక్రమేణ చిత్రీకరణ ఒక గొప్ప శక్తిగా రూపాంతరం చెందింది. అతి కాస్తా తన అభిరుచి, ఫ్యాషన్‌గా మారిపోయింది. అతడికి ఈ కళ ఒకరకంగా అపారమైన ఏకాగ్రత అబ్బేలా చేసింది. ఆ నేపథ్యంలోనే వివరణాత్మక చిత్రపటాలు, శక్తిమంతమైన ప్రకృతి దృశ్యాలతో ప్రేక్షకులను అలరించాడు. అలా చివరికి  లలిత కళలలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. పాటిల్‌ చిత్రీకరణ సాంకేతికతపై మంచి పట్టుని సంపాదించుకున్నాడు. 

ప్రపంచ దృష్టించిన ఆకర్షించేలా రికార్డు..
పాటిల్‌ అంకితభావం చివరికి అతనికి అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిపెట్టింది. యుక్తవయసులో, ఒక గంటలోపు తన కాలి వేళ్లను ఉపయోగించి అత్యధిక సంఖ్యలో డ్రాయింగ్‌లను సృష్టించిన తర్వాత అతను గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కాడు. ఈ ఘనత వేగం కంటే అతడు వేసిన తీరు అతడిని వార్తల్లో నిలిచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నిజానికి పాదాలతో బొమ్మలు చిత్రించాలంటే..బ్రష్‌ను నియంత్రించడానికి సమతుల్యత, కండరాల బలం, తీవ్రమైన ఏకాగ్రత, నిరంతర సాధన చాలా అవసరం. 

అయితే పాటిల్‌ వాటిన్నింటిని మరింత మెరుగపరుచుకున్నాడు. అదే అతడని ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా చేసింది. పాటిల్‌ చిత్రాలు కళాభిమానులు, ప్రభుత్వ అధికారులు, సోషల్‌ మీడియా ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. అంతేగాదు ఈ అభిరుచి కాస్తా.. స్థిరమైన జీవనోపాధిగా మార్చుకున్నాడు. అంతేగాదు పాటిల్‌ వ్యక్తిగతంగా సక్సెస్‌ అయితే చాలు అనుకోలేదు. ముఖ్యంగా తనలాంటి విద్యార్థులకు, వినికిడి లోపం ఉన్నవారికి క్రియేటివిటీ, సాంకేతికత నైపుణ్యాలను నేర్చుకోవడంలో సహాయ సహకారాలు అందిస్తుండటం విశేషం.  

(చదవండి: 109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్‌ డాక్టర్‌..!)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)