Breaking News

దేవుని దయతో, వృద్ధాప్య కష్టాలనైనా అధిగమించడం సులభమే!

Published on Fri, 10/24/2025 - 18:23

జీవిత ప్రయాణంలో చివరి దశ అయిన ముసలితనానికి వెరవని మనిషి సాధారణంగా ఉండడు. ముసలితనం కష్టాలను కనులకు కట్టినట్లుగా అన్ని వివరాలతో ఇలా వర్ణన చేసి చెప్పాడు కూచిమంచి తిమ్మకవి ‘కుక్కుటేశ్వర శతకం’ లోని ఒక పద్యంలో! 

నోరు చేదై తినడానికి వీలుగాక భోజనం రుచి తప్పుతుంది; శరీర పటుత్వం తగ్గి వొడలెల్ల వణకడం మొదలవుతుంది; పోను పోను వినికిడి శక్తి తగ్గిపోయి, చివరికి చెవులకు చెవుడు వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎప్పుడూ ఏదో ఒక రుగ్మత శరీరాన్ని బాధపెడుతుంది.  దాని వలన ఎప్పుడూ ఒక రకమైన ‘నిత్యదిగులు’ మనసులో తిష్ఠ వేసుకుని కూర్చున్న కారణంగా రోజులన్నీ దిగులుగానే గడవడం ప్రారంభమవుతుంది. కళ్ళ సంగతి ఇక చెప్పనే అవసరం లేదు, అవి అప్పటికే సులోచనాల పాలై ఉంటాయి. అదనంగా శుక్లాల వంటివి తయారై చూపును పూర్తిగా కమ్మేసి ఏదీ కనపడకుండా చేస్తాయి. ఇవన్నీ అలా వుండగా, అన్నిటికంటే అవమానకరంగా, పడుచువాళ్ళు పరిహాసాలాడుతూ పకపకా నవ్వడాలను కాదనలేక, ఏమీ చేయలేక చూస్తూ ఊరుకోవలసి వస్తుంది. 

తే. మది దలంపగ గటకటా! ముదిమి యంత 
   రోత లేదుగదా! ధారుణీతలమున, 
   భూనుతవిలాస, పీఠికాపుర నివాస
   కుముద హితకోటి సంకాశ, కుక్కుటేశ!

ఇలా ఇన్నిరకాల అసౌకర్యాలతోనూ, అవమానాలతోనూ కూడినదైన ఈ ముసలితనాన్ని మించిన కష్టం, లోకంలో మరింకేమి ఉంటుంది చెప్పవయ్యా స్వామీ, ఓ పిఠాపుర నివాస శ్రీ కుక్కుటేశ్వర స్వామీ! – అంటూ, కష్టాలతో కూడినదైన ఈ ముసలితనం బాధ నుంచి తప్పించి, ముక్తిని ప్రసాదించు స్వామీ అన్నది విన్నపం. అంటే దేవుని దయ ఉంటే వృద్ధాప్య కష్టాలనైనా అధిగమించడం సులభమే!     

– భట్టు వెంకటరావు

 

 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)