Breaking News

ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవాలా?

Published on Sun, 01/07/2024 - 13:20

నాకు ఇప్పుడు 7వ నెల. జీటీటీ టెస్ట్‌ రాశారు. మా కుటుంబంలో ఎవరికీ షుగర్‌ లేకపోయినా నేను ఆ టెస్ట్‌ చేయించుకోవాలా? రిజల్ట్‌ ఎలా వస్తుందోనని భయపడి టెస్ట్‌ చేయించుకోలేదు. ఈ టెస్ట్‌ అందరికీ చేస్తారా?
– షమా ఫిర్‌దౌజ్, బనగానపల్లె.

గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ అనేది ఒక రక్తపరీక్ష. 7వ నెల మొదట్లో గర్భిణీలందరికీ రొటీన్‌గా చేసే పరీక్ష. ఇది జెస్టేషనల్‌ డయాబెటీస్‌ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్‌ని కనిపెడుతుంది. మీ శరీరం సాధారణ బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయిలను మెయిన్‌టేన్‌ చేస్తుందా లేదా అనేది ఈ పరీక్ష ద్వారా చెక్‌ చేస్తారు. అందుకే జీటీటీ టెస్ట్‌ని గర్భిణీలందరికీ చేస్తారు.

ముఖ్యంగా 85 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారికి, తొలి చూలులో బిడ్డ నాలుగున్నర కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టినా.. ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్‌ వచ్చినా, కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్‌ ఉన్నా.. ఈ టెస్ట్‌ చేయాలి. జీటీటీలో రిజల్ట్‌ నార్మల్‌ వస్తే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్‌ రిస్క్‌ లేదని అర్థం. రిజల్ట్‌ అబ్‌నార్మల్‌ వస్తే  డయాబెటీస్‌ స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. తీసుకోవాల్సిన డైట్, మానిటరింగ్‌ను వివరిస్తారు. ఈ మధ్యకాలంలో 2–12 శాతం వరకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్‌ కనిపిస్తోంది.  

-డా.భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: ఫుడ్ అలెర్జీ ఎందుకొస్తుందో తెలుసా?.. పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెల్లడి)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)