Breaking News

చేతులు కడుక్కుందాం..ఆరోగ్యంగా ఉందాం..!

Published on Tue, 10/15/2024 - 10:16

Global Handwashing Day 2024: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్‌ హైజీన్‌) అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ‘గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే’ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి గాను దీన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలిసి 2008లో ‘గ్లోబల్‌ హ్యాండ్‌వాషింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ సముదాయంగా రూపొందాయి. ఆనాటి నుంచి దాదాపు 100కు పైగా దేశాల్లోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్కూళ్లు, ప్రైవేటు సంస్థలు ఈ రోజున చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై అవగాహన కల్పిస్తున్నాయి. 

ఈ ఏడాది థీమ్‌ : ‘‘శుభ్రమైన చేతులు ఎందుకు అవసరమంటే’’? 

ఈ పొరబాట్లు చేయకండి... 

  • చేతులు కడుక్కోవడం అందరికీ తెలిసిన విద్యే. ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేమీ లేవు. రెండుమూడేళ్ల కిందట కరోనా వచ్చినప్పుడు మందులూ, మాకులూ, వ్యాక్సిన్ల కంటే ముందుగా అందరి ప్రాణాలు రక్షించింది ఈ చేతులు కడుక్కోవడమనే పనే. చేతులు కడుక్కోవడంలో చేసే కొన్ని పొరబాట్లను సరిదిద్దుకోవడమెలాగో చూద్దాం.

  • సబ్బును మరవకండి: వాష్‌ బేసిన్‌లో నల్లా / కొళాయి కింద చేతులుంచినా చేతులు కడుక్కున్నట్టే. కానీ హానికరమైన మురికి అంతా తొలగి΄ోవాలంటే సబ్బును వాడాల్సిందే. 

  • మొక్కుబడిగా వద్దు: చేతులు కడిగేదే మురికినంతా శుభ్రం చేసుకోడానికి. అందువల్ల సబ్బు రాసుకున్న చేతివేళ్లను శుభ్రంగా కనీసం 20 సెకన్ల పాటు రుద్దుకుంటూ కడగాలి. 

  • పొడిగా అయేంతవరకు ఆగండి: చేతుల్ని శుభ్రం చేసుకున్న వెంటనే 

  • ఆ తడిచేతులతోనే ఏదైనా పనికి ఉపక్రమించడం సరికాదు. తడి చేతులు పొడిగా అయ్యేవరకు ఆగి అప్పుడు తినడం లేదా ఏదైనా పనిచేయడం మొదలుపెట్టాలి. 

  • ఒకసారి చేతులు శుభ్రంగా కడిగాక తినడం లేదా ఏదైనా పని చేయడం పూర్తయ్యే వరకు మురికిగా ఉండే ఉపరితలాలను తాకడం సరికాదు. 

  • ఆదరాబాదరా అసలే వద్దు

  • కొందరు చేతులు కడుక్కునేటప్పుడు ఆదరాబాదరా కడిగేసుకుంటారు. రెండు వేళ్లకూ మధ్యనుండే చోట్ల లేదా గోర్ల చివరల్లో అంతగా శుభ్రం చేసుకోరు. చేతులు కడుక్కోవడం అంటే వేలికీ వేలికీ మధ్యనుండే చోట్లలో, అలాగే గోర్ల కింద కూడా శుభ్రంగా కడుక్కోవాలి.  

చదవండి: అలాంటి జన్యువులు ఉంటే బరువు తగ్గడం ఈజీ..!

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)