Breaking News

ఎత్తైన దిండ్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే

Published on Sat, 02/28/2026 - 17:58

దిండు లేకుండా నిద్ర పోవడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గి గ్లాకోమా తీవ్రత తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత అంధత్వానికి దారితీసే కారణాలలో గ్లాకోమా ఒకటి. దీనికి ప్రధాన కారణం కంటిలో ఉండే అధిక ఒత్తిడి దృష్టి నరాన్ని దెబ్బతీయడం. 

ఎత్తైన దిండ్లు లేదా ఒకటి కంటే ఎక్కువ దిండ్లను వాడటం వల్ల మెడలోని జుగులార్‌ వెయిన్‌పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కంటి ద్రవం సరిగ్గా బయటకు వెళ్లలేక, కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి దృష్టి నరాన్ని (ఆప్టిక్‌ నెర్వ్‌)ప్రభావితం చేస్తుంది. ఇది గ్లాకోమా రావడానికి కారణం అవుతుంది. బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆప్తమాలజీలో ప్రచురించిన ప్రకారం, ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు 144 మంది గ్లాకోమా రోగులను పరీక్షించారు. కూర్చున్నప్పుడు, రెండు దిండ్లతో పడుకున్నప్పుడు, దిండు లేకుండా పడుకున్నప్పుడు వారి కంటి లోపల ఉండే ఒత్తిడిని ప్రతి రెండు గంటలకు ఒకసారి 24 గంటల΄ాటు పరిశీలించారు. దిండ్లతో తల ఎత్తుగా పెట్టి పడుకున్నప్పుడు, దాదాపు మూడింట రెండు వంతుల మంది రోగులలో కంటిలో ఒత్తిడి పెరిగినట్లు వారు గమనించారు. యువకులు, ప్రైమరీ ఓపెన్‌–యాంగిల్‌ గ్లాకోమా ఉన్నవారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు.  

ఈ ఫలితాలు  ప్రాథమికమైనవే అయినప్పటికీ, గ్లాకోమా ఉన్నవారు తాము నిద్రించే విధానంలో జాగ్రత్త వహించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)