Breaking News

ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!

Published on Wed, 04/30/2025 - 09:52

నా స్నేహితుడు ఒక ప్రైవేటు చిట్‌ఫండ్‌ కంపెనీలో డబ్బు తీసుకునేటప్పుడు నేను హామీ (ష్యూరిటీ) ఇచ్చాను. ఇప్పుడు అతను పరారీ లో ఉన్నాడు. చిట్‌ఫండ్‌ వారు నాపై కేసు వేశారు. ఆ మొత్తం నేను కట్టవలసిందేనా?
– రాహుల్, ఖమ్మం 

ష్యూరిటీ ఇమ్మని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా! ష్యూరిటీ ఇచ్చిన తర్వాత మీరు ఎంత మొత్తానికి హామీ ఇచ్చారో అంత మొత్తం మీ వద్ద నుండి వసూలు చేస్తారు. వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు. మీ స్నేహితుడికి ఏవైనా ఆస్తులు ఉంటే అవి జప్తు చేయవలసినదిగా కోరవచ్చు. 

అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. ష్యూరిటీ ఇచ్చేముందు జాగ్రత్త వహించడం మంచిది. నమ్మకస్తులకి, డబ్బు తిరిగి చెల్లించే స్థితి ఉన్న వారికి మాత్రమే ష్యూరిటీ ఇవ్వడం మంచిది.

నేను ఒక ప్రైవేటు సంస్థలో చిట్టీ కట్టాను. మొత్తం 50 నెలలు కట్టాలి కానీ నా పరిస్థితులు బాగుండక 15 నెలలు మాత్రమే కట్టాను. చిట్టీ ఎత్తలేదు. నేను కట్టిన డబ్బు నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలి?
– సుందర్, హైదరాబాద్‌

చిట్టీ కట్టడాన్ని మధ్యలోనే ఆపేయడం తరచుగానే చూస్తుంటాం. మంచి సంస్థలలో అయితే లిఖితపూర్వక హామీపత్రాలు (అగ్రిమెంట్‌) ఉంటాయి కాబట్టి, అందులోని ఒప్పందం ప్రకారం కొంత జరిమానా విధించి మీరు అప్పటివరకు కట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంటారు. కొన్ని సంస్థలు అయితే చిట్టీ గడువు పూర్తిగా ముగిశాక లేదా మీ బదులు ఇంకెవరైనా మీ గ్రూపు చిట్టీలో కలిస్తే కొంత కమీషన్‌ తీసుకొని డబ్బు తిరిగి ఇస్తుంటారు.

 ఏది ఏమైనా, మీరు కట్టినన్ని డబ్బులు మీకు రావు కానీ పూర్తి నష్టం మాత్రం ఉండదు. మీరు చిట్టీ కట్టిన సంస్థని సంప్రదించి క్యాన్సిలేషన్‌ అడగండి. వారి నిబంధనల మేరకు వారికి రావలసిన మొత్తాన్ని మినహాయించుకుని మిగిలినది ఇస్తారు.  

(చదవండి: ప్లంబర్లుగా మహిళా శక్తి!)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)