Breaking News

జీవితాల్ని మార్చే జీవన'గీత'!

Published on Tue, 12/10/2024 - 18:03

అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని, సర్వులకు ప్రతినిధిగా భావించి, సకల మానవాళికి.. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినిపించిన కర్తవ్య బోధ. అర్జునుడిని కార్యోన్ముఖుణ్ని చేసిన మహా ఉపదేశం ఇది. జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్లు, మోదం, ఖేదం తప్పవనీ.. అన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అనే జీవితపాఠాన్ని నేర్పే కార్యనిర్వాహక గ్రంథం ఇది. రాక్షస స్వభావాన్ని అంతం చేసే నిప్పుకణిక ఈ గ్రంథం. మానవాళి మొత్తానికి జీవనాడి ఈ గ్రంథం. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహాగ్రంథం భగవద్గీత. మన జీవితాలను మార్చే మహామంత్రం.

మార్గశిర శుద్ధ ఏకాదశి రోజుని 'గీతా జయంతి'గా జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా.. భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ఇందులో అన్ని వయసుల వారూ జీవితంలో విజయాలు సాధించడానికి దోహదపడే మార్గదర్శకాలు ఉన్నాయి. నిత్య జీవితాన్ని నడపడానికి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో భగవద్గీతలో ఉన్నాయి.

బుద్ధి వికాసానికి...
మన జీవన పయనం సాఫీగా సాగాలంటే, ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే ‘భగవద్గీత’ అనే క్షీర సాగరంలో మునగాలి’’ అన్నాడు అమెరికన్‌ రచయిత హెన్రీ డేపిట్‌ థోరో. ప్రతి శ్లోకాన్నీ పఠించి, అర్థం చేసుకుంటే బుద్ధి శుద్ధి అవుతుందని చెప్పారు. ఆధునిక విజ్ఞానం జనాన్ని వేగంగా గమ్యాన్ని చేరుకునేలా ఉరకలు పెట్టిస్తుందే తప్ప..కింద పడితే మళ్లీ లేచి పుంజుకోవడం ఎలా అనేది నేర్పించడం లేదు. దీన్ని గీత నేర్పిస్తుంది. 

ఆరోగ్య గీత...
ఆరోగ్యపరంగా  ఆహారాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత ఆరో అధ్యాయం వివరించింది. ఎలాంటి ఆహారం తినాలో పదిహేడో అధ్యాయంలో ఉంది.. ఆహార విషయంలో సయమనం పాటించకపోవడం వల్లే రోగాల పాలవుతున్నామని నొక్కి చెప్పింది. మనసును ఉద్రేకపరచని, రుచికరమైన, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలమనేది  గీతోపదేశం.

మనోధైర్యం..
శరీరం దృఢంగా ఉన్నా మనోబలం లోపిస్తే చేసే పనిలో ఫలితం సాధించలేం. ఈ విషయాన్నే భగవద్గీత రెండో అధ్యాయం మూడో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు మహా బలవంతుడు. కానీ మనోదౌర్బల్యం కారణంగా యుద్ధం చెయ్యనన్నాడు. కృష్ణుడు అది గమనించి, అర్జునుణ్ణి ఉత్తేజపరచి, అతనిలోని అంతర్గత శక్తిని ప్రేరేపించి, కార్యోన్ముఖుణ్ణి చేశాడు. 

వైఫల్యాన్ని అధిగమించాలంటే..
ఒక వ్యక్తి జీవితంలో సరిగ్గా స్థిరపడకపోతే, దానికి కారణం ఇతరులేనని ఆరోపిస్తాడు. తన వైఫల్యాలకు తనే కారణం అని గుర్తించడు. మనస్సునూ, ఇంద్రియాలనూ తన ఆధీనంలో ఉంచుకుంటే తనకు తానే మిత్రుడు. అలా కానినాడు తనకు తానే శత్రువు. కాబట్టి మనస్సును నిగ్రహించుకోవడం అత్యావశ్యకం.దీనికి క్రమశిక్షణతో కూడిన అభ్యాసం అవసరం. మనసు వశమైతే సాధించలేని కార్యం ఏదీ ఉండదు. 

ఆధ్యాత్మిక గీత...
శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందినా... ఆధ్యాత్మిక వికాసం లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు. పరిపూర్ణత సిద్ధించదు. రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, భేద బుద్ధి తొలగాలంటే ఆధ్యాత్మిక వికాసం పొందాల్సిందే. చైతన్యం కలగాలి. సమదృష్టి పెంపొందాలి. భగవంతుడు ఉన్నాడనీ, అతడే జగన్నాటక సూత్రధారి అనీ గ్రహించాలి. ఇలా భగవద్గీతను నిత్య జీవితంలో భాగం చేసుకున్నట్లయితే(ఆచరిస్తే) ‘జీవనగీత’గా దారి చూపిస్తుంది.

(చదవండి: మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..)

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)