Breaking News

నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..

Published on Thu, 02/01/2024 - 10:43

నెయిల్‌ రిమూవర్‌ గురించి మనందరికీ తెలుసు. మన వేలి గోళ్లపై నెయిల్‌ పాలిష్‌ సరిగ్గా లేకున్నా లేదా తొలగించాలనుకున్నా నెయిల్‌ రిమూవర్‌ని ఉపయోగిస్తాం. అలానే ఓ చిన్నారి తన వేలి గోళ్లకు నెయిల్‌ పాలిష్‌ సరిగా లేదని తొలగించేందుకు నెయిల్‌ రిమూవర్‌ని ఉపయోగించింది. అంతే అనూహ్యంగా మంటలు చెలరేగి తీవ్ర గాయాల బారినపడింది ఆ చిన్నారి. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఓహియోకు చెందిన 14 ఏళ్ల కెన్నడి అనే బాలిక కొవ్వొత్తి దగ్గర కూర్చొని నెయిల్‌ పాలిష్‌ని తొలగిస్తుంది. తన వేళ్లకు నెయిల్‌ పాలిష్‌ సంక్రమమైన రీతీలో లేదని తొలగించాలనుకుంటుంది. అయితే ఆ టైంలో తన మంచానికి సమీపంలో కొవ్వొత్తి కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఆ నెయిల్‌ రిమూవర్‌ ఆవిరికి సమీపంలోనే కొవ్వొత్తి ఉండటంతో ఒ‍క్కసారిగా భగ్గుమని మంటలు లేచిపోయాయి. దీంతో ఆ చిన్నారి చేతిలోని నెయిల్‌ పాలిష్‌ బాటిల్‌ డబ్ మని పగిలి మంటలు మరింతగా మంటలు వ్యాపించాయి.

ఆమెతో సహా అక్కడ ఉన్న వస్తువులన్నీ అంటుకుపోతున్నాయి. ఈ హఠాత్పరిణామానికి బిగ్గరగా కేకలు పెట్టింది. అయితే ఆ టైంలో చిన్నారి తల్లిదండ్రులు వేరే పనిలో ఉన్నారు. కెన్నడీ అరుపుతో ఉలిక్కిపడ్డ తలిదండ్రులు ఆమె బెడ్‌ రూంలోకి హుటాహుటీనా వెళ్లి చూడగా..గదిఅంతా పొగలు కమ్మి చిన్నారి మంటల్లో చిక్కుకుని ఉంది. వెంటనే వారు  స్పందించి..కెన్నడీని చుట్టుముట్టిన మంటలను ఆర్పేసి హుటాహుటీనా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనతో తల్లిందండ్రలు గట్టి షాక్‌లోకి వెళ్లిపోయారు.

పాపం ఆ చిన్నారి తీవ్రంగా గాయపడటంతో చర్మం చాలా వరకు కాలిపోయింది. పొత్తి కడుపు నుంచి, రెండు తొడలు, ఆమె కుడి చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయా భాగాల్లో ఎక్సిషన్‌ అనే శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతానికి ఆమె చేతులు కొంతవరకు నయం అయ్యాయి. మిగతా భాగాలకు అయ్యిన గాయాలు తగ్గి కొత్త చర్మం రావడానికి కనీసం ఏడాదిపైన పడుతుందని వైద్యులు తెలిపారు. అంతేగాదు అవి తగ్గేందుకు కొద్దిపాటి చికిత్స కూడా తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఏదీఏమైనా పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడూ మధ్యమధ్యలో కాస్త గమనించండి. ఎల్లవేళల వారిపై ఓ కన్నేసి ఉంచండి. లేదంటే తెలిసి తెలియన పనులతో ప్రాణాలపైకి తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. 

(చదవండి: చికూ ఫెస్టివల్‌ గురించి విన్నారా? ఆ ఫ్రూట్‌ కోసమే ఈ పండుగ!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)