లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్
Breaking News
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
Published on Sat, 08/03/2024 - 11:01
కొందరికి చెవి రింగులు లేదా దుద్దులు సరిపడక చెవి తమ్మెలకు ర్యాష్ రావచ్చు. కృత్రిమ ఆభరణాలలోని నికెల్ కారణంగా కొందరిలో ఈ ర్యాషెస్ వస్తాయి. ఫలితంగా దురద, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే గాయం మరింత రేగి, రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యను ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు.
ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
నికెల్‌తో అలర్జీ ఉన్నవారు ఆ లోహంతో తయారైన రింగులు, దిద్దుల వంటి కృత్రిమ ఆభరణాలు ధరించడం సరికాదు.ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్ ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్న చోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాస్తే త్వరగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గక పోతే డాక్టర్‌ను సంప్రదించాలి.
Tags : 1