Breaking News

జెన్‌–జడ్‌ రెబల్స్‌..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!

Published on Fri, 03/28/2025 - 10:55

జెన్‌–జడ్‌ అనగానే ‘డైనమిక్‌ నేచర్‌’ అంటారు. అంతమాత్రాన అంతా సవ్యంగా ఉన్నట్లు కాదు. జెన్‌–జడ్‌ ఉద్యోగులు సరిచేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జెన్‌–జడ్‌లో ప్రొఫెషనలిజం లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని, ప్రొఫెషనల్‌ స్కిల్స్‌ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు...

క్వాయిట్‌ క్విట్టింగ్‌
యువ ఉద్యోగులకు సంబంధించి నిశ్శబ్ద నిష్క్రమణ (క్వాయిట్‌ క్విట్టింగ్‌) భారతీయ పరిశ్రమలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పరిశ్రమ నిర్వాహకులలో ఆందోళనను పెంచుతుంది. ‘ఉద్యోగం అంటే కాలేజికి ఎక్స్‌టెన్షన్‌ కాదు. ప్రొఫెషనలిజం అవసరమని చాలామందికి అర్థం కావడం లేదు. 

వివిధ రంగాల డైనమిక్స్‌పై కూడా అవగాహన కొరవడింది. ప్రతి రంగానికి ఒకే రకమైన పని అవసరాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. జెన్‌–జడ్‌ ఉద్యోగుల ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు టీమ్‌లీజ్‌ డిజిటల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీతి శర్మ.

జెన్‌ జడ్‌ అలా కాదు...
పాత తరం ఉద్యోగులు, జెన్‌–జడ్‌ ఉద్యోగులకు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ‘మౌనమే మంచిది’ అన్నట్లుగా ఉండేవాళ్లు. జెన్‌–జడ్‌ అలా కాదు...తమ అసమ్మతిని బహిరంగంగా చెప్పడానికి వెనకాడడం లేదు. పని ప్రమాణాలు, అవసరాల విషయంలో యువతరానికి, పాతతరానికి ఎంతో తేడా ఉంది. ‘పని మాత్రమే జీవితం అని యువతరం అనుకోవడం లేదు. పనికి మించిన జీవితం ఉందనే విషయం వారికి తెలుసు. 

అయితే దీన్ని పాతతరం అంగీకరించం కష్టం’ అంటుంది దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్‌ దివిజా బాసిన్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయిన దివిజకు 2.6 లక్షలకు పైగా ఫాలోవర్‌లు ఉన్నారు. ‘హార్డ్‌ వర్క్‌’ను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది అంటారు ఆమె. అయితే ఇది చిత్రానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు యువతలోని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి.

స్కిల్‌ గ్యాప్‌
ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ట్రేడ్‌ బాడీ నాస్కామ్‌ నివేదిక ప్రకారం టెక్‌ రంగంలో ఆరు లక్షల మంది నిపుణుల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న ‘స్కిల్‌ గ్యాప్‌’ సమస్యకు సులువైన పరిష్కార మార్గాలు లేకపోయినప్పటికీ యువత కార్పొరేట్‌ వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడే సాఫ్ట్‌ స్కిల్క్స్‌పై పరిశ్రమలు మరింత దృష్టి పెట్టే అవసరం ఉంది. రిక్రూట్‌మెంట్‌కు వచ్చే కంపెనీలు విద్యార్థుల్లో సాఫ్ట్‌ స్కిల్స్‌కు సంబంధించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయని దిల్లీకి చెందిన ఒక టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిక్రూట్‌మెంట్‌ హెడ్‌ చెప్పారు.

కష్టమే సుమీ!
అమెరికాకు చెందిన రెజ్యూమ్‌బిల్డర్‌.కామ్‌ నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది మేనేజర్‌లు, బిజినెస్‌ లీడర్లు జెన్‌ జడ్‌తో పనిచేయడం కష్టమని చెప్పారు. స్కిల్‌ అసెస్మెంట్‌ సంస్థ వీబాక్స్‌ ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ ప్రకారం భారతీయ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. 

నేషనల్‌ ఎంప్లాయిబిలిటీ రిపోర్ట్‌ ఫర్‌ ఇంజనీరింగ్‌ ప్రకారం 80 శాతం మంది భారతీయ ఇంజనీర్‌లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుబాటులో ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడం తప్ప కంపెనీలకు మరో మార్గం కనిపించడం లేదు. 

(చదవండి: 

#

Tags : 1

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)