Breaking News

మీతో మీరు అనుబంధం ఏర్పరుచుకోండి...

Published on Mon, 01/19/2026 - 06:10

‘నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్త్రీ, పురుషులు కుటుంబాల కోసం, ఉద్యోగాల కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం ఏమేమి చేయాలా అని నిత్యం ఆందోళన చెందుతున్నారుగానీ తమ కోసం తాము ఏం చేసుకోవాలనే సంగతిని మర్చి΄ోతున్నారు. నేడు ప్రతి మనిషి  అన్నీ పట్టించుకుంటూ తనను తాను నిర్లక్ష్యం  చేసుకుంటున్నాడు. మీకేమి కావాలో గ్రహించండి. మీతో మీరు అనుబంధం పెంచుకోండి’ అన్నారు  ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న ఆధ్యాత్మిక మార్గదర్శి గురు గోపాల్‌దాస్‌.

‘అయిన వారి కోసం అన్నీ చేయాల్సిందే... కానీ వారి కంటే మీ అయిన వారు మీరే. మీకేం కావాలి? మీ ఇష్టాల గురించి, ఆరోగ్యం  గురించి, అభిరుచుల గురించి,  లక్ష్యాల గురించి, అసలేమీ చేయకుండా కొన్నాళ్లు గడపాలనుకుంటున్న తీరిక సమయాల గురించి మీరేమి చేసుకుంటున్నారు? మీతో మీ అనుబంధం సరిగా లేక΄ోతే మీ అయినవారికి మీరు చేయాల్సిందంతా ఎలా చేయగలరు?’ అని ప్రశ్నిస్తారు గురు గోపాల్‌దాస్‌.
‘జైపూర్‌ సాహితీ సంరంభం’ లో తన తాజాపుస్తకం ‘యూ కెన్‌ హావ్‌ ఇట్‌ ఆల్‌’ వెలువడిన సందర్భంగా  జీవన మార్గాల సులభతరం గురించి ఆయన మాట్లాడారు.

మార్చలేని సమస్యలు
ప్రతి మనిషికీ జీవితంలో సమస్యలు ఉంటాయి. వాటిలో కొన్ని పరిష్కరించేవి ఉంటాయి... కొన్ని పరిష్కరించలేనివి. ఉదాహరణకు ఫలానా వ్యక్తికి మీరంటే పడదు... మీ గురించి చెడు చెప్తుంటాడు... మీరు ఎంత ప్రయత్నించినా మారడు. దానిని నేను గణితంలో ‘పై’తో ΄ోలుస్తాను. ఏం చేసినా దాని విలువ మారదు. కాబట్టి మార్చలేని సమస్యలను పూర్తిగా వదిలిపెట్టాలి. వాటికై ఏ మాత్రం శక్తి వృథా చేయకూడదు. రెండో రకం సమస్యలు... మార్చదగ్గవి. మీ అబ్బాయికి మంచి కాలేజ్‌లో సీటు రాని పరిస్థితి ఉంటే మెరుగైన కాలేజ్‌లో అయినా మీరు సంపాదించగలరు కదా. దీనిని నేను గణితంలో ‘ఎక్స్‌’ విలువ కనుగొనడంతో ΄ోలుస్తాను. అలాంటి ఎక్స్‌ సమస్యల గురించి  పని చేయాలి. కాబట్టి ‘పై’ను వదిలిపెట్టండి. ‘ఎక్స్‌’ సంగతి చూడండి.

రాళ్లు కింద పడేయండి
ఒక సాధువు దగ్గరకి ఒక కుర్రవాడు వచ్చి ‘స్వామీ... నాకు మనశ్శాంతి కావాలి’ అని అడిగితే ఆ సాధువు కొన్ని రాళ్ల చూపించి ‘వాటిని వారంపాటు మూటలో వేసుకుని విడువకుండా తిరుగు’ అన్నాడు. ఆ కుర్రవాడు ఆ రోజూ ఆ రాళ్లమూటతో తిరగడం మొదలెట్టాడు. ఆ రాళ్లు రాను రాను బరువయ్యాయి.  చివరిరోజు సాధువు ఆ మూటను కింద పడేయ్‌ అనగానే కుర్రవాడికి మనశ్శాంతి అంటే ఏమిటో అర్థమైంది. మనమంతా అనవసర రాళ్లను మోస్తూ ఉంటాం. అసూయ, కుళ్లు, కుతంత్రం, ద్వేషం, పగ, దురాశ, స్వార్థం... సంబంధం లేని వ్యక్తి/విషయం గురించి అభి్రపాయం, సామాజిక మాధ్యమాలలో ముసుగు ముఖంతో విమర్శలు గుప్పిస్తుంటాం... ఇవన్నీ బరువులు. ఈ రాళ్లను ప్రతిరోజు ఉదయాన్నే లేచి లెక్కబెట్టి పారేయండి. మనశ్శాంతి తప్పక దొరుకుతుంది.

మాట్లాడండి
నేటి మనిషి దేని గురించీ మాట్లాడటం లేదు. అన్నీ మనసులో పెట్టుకుంటున్నాడు. నీతో ఈ సమస్య ఉంది... నా వల్ల ఈ ΄÷రపాటు జరిగింది... అని భార్యాభర్తలు, పిల్లలు, ఉద్యోగులు, ఇరుగు ΄÷రుగు వారు మాట్లాడుకుంటే సమస్యలు లేని సామరస్య జీవితం దొరుకుతుంది. చాలా సమస్యలు కేవలం మాట్లాడక΄ోడం వల్ల పాషాణరూపం దాలుస్తాయి. మౌనం సమస్యకు మూలం. మౌనం వద్దు. మాట మొదలెట్టండి... మాట్లాడండి అని బోధించారు గురు గోపాల్‌దాస్‌.
ఆయన మాటలను వినడంతో వదిలేయకుండా ఆచరణలో పెడితేనే మనశ్శాంతి కలుగుతుంది.

– జైపూర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

Videos

Anil Ravipudi: చిరంజీవి పేరు... పెట్టడానికి కారణం ఇదే ...?

జగనన్నకు ఓటేస్తే చంపేస్తావా? బాబుపై జూపూడి ఫైర్

Delhi : 5.7 తీవ్రతతో భారీ భూకంపం..

YSRCP Leaders: న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు

మహాకవి యోగి వేమనకు వైఎస్‌ జగన్‌ నివాళులు

Renu Desai: ఆ 5 కుక్కల కోసం 95 కుక్కలను చంపుతారా?

Anil Ravipudi: నాగార్జున, మహేష్ తో సినిమా కన్ఫర్..?

Pinnelli: డిజీపీ ఆఫీసు వద్ద YSRCP నేతల కీలక ప్రెస్ మీట్

కోర్టు ధిక్కరణ కేసు.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు

పాకిస్తాన్ లో భారీ అగ్నిప్రమాదం..14 మంది మృతి..

Photos

+5

రాతివనం.. అపురూపం

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

మేడారం సందడి (ఫోటోలు)