Breaking News

బాపూ సమరం తెరపై చూపుదాం

Published on Wed, 10/02/2024 - 00:24

‘రక్త మాంసాల దేహంతో అలా ఓ మనిషి ఈ నేలమీద నడయాడాడని చెబితే, ముందు తరాల వారు నమ్మరు’ అన్నాడు ఐన్‌స్టీన్‌. టాల్‌ స్టాయ్, జోసెఫ్‌ స్టాలిన్, విన్‌స్టన్‌ చర్చిల్, జె.ఎఫ్‌. కెన్నెడీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలా దాకా... ఎందరో గాంధీజీ వల్ల ప్రభావితం అయ్యారు. గాంధీజీ ఆత్మకథ పిల్లలందరూ చదవాలి. లేదా కనీసం ఆయన పై వచ్చిన సినిమాలు చూడాలి. గాంధీపై వచ్చిన కొన్ని సినిమాలు. అలాగే గాంధీ గారి వల్ల వచ్చిన సినిమాలు

మోడర్న్‌ టైమ్స్‌: 1936లో వచ్చిన ఈ సినిమా నేటికీ గొప్ప క్లాసిక్‌గా నిలిచి ఉంది. యంత్రం కంటే మానవుడే గొప్పవాడు అని చెప్పే సినిమా అది. చార్లి చాప్లిన్‌ ఈ సినిమా తీసి నటించడానికి కారణం గాంధీ మహాత్ముడు. రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాంధీజీ లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ చార్లీ చాప్లిన్‌ను కలిశాడు. అప్పటి వరకూ చార్లీ చాప్లిన్‌ యంత్రాలు మనుషులను శ్రమ నుంచి విముక్తి చేస్తాయని భావించాడు. కాని గాంధీజీ చెప్పిన మాటల వల్ల యంత్రాలు మనిషికి సహాయం చేయడం కంటే అతడికి పని కోల్పోయేలా చేయడమే గాక బానిసగా చేసుకుంటున్నాయని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రభావంతోనే చాప్లిన్‌ మోడర్న్‌ టైమ్స్‌ తీశాడు.

ది మేకింగ్‌ ఆఫ్‌ ది మహాత్మ:  భారతదేశంలో గాంధీ అడుగు పెట్టి బ్రిటిష్‌ వారిపై పోరాడక ముందు దక్షిణాఫ్రికాలో ఆయన వర్ణ వివక్షపై పోరాడాడు. గాంధీలోని పోరాటగుణం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచే సాహసం దక్షిణాఫ్రికాలోనే రూపుదిద్దుకున్నాయి. అక్కడ ఒక చలిరాత్రి ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌ నుంచి గాంధీని కిందకు దించి అవమానించారు, ఆయన దగ్గర టికెట్‌ ఉన్నా, నల్లవాళ్లు ఫస్ట్‌ క్లాస్‌లో ప్రయాణించకూడదని. ప్రతి వ్యక్తికీ ఆత్మగౌరవంతో, స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో, సమాన భావనతో జీవించే హక్కు ఉందని చాటడమే గాంధీజీ జీవన సందేశం. అది ‘ది మేకింగ్‌ ఆఫ్‌ ది మహాత్మా’లో చూడవచ్చు. శ్యామ్‌ బెనగళ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996లో విడుదలైంది. రజత్‌ కపూర్‌ గాంధీగా నటించాడు.

లగే రహో మున్నాభాయ్‌: గాంధీజీ అంటే చౌరస్తాలో కనిపించే ఒక విగ్రహం కాదు, గాంధీ జయంతి రోజు స్కూళ్ల సెలవుకు కారణమయ్యే ఒక వ్యక్తి కాదు... గాంధీజీ అంటే జీవన మార్గదర్శి. జీవితం నిర్భయంగా సాగాలంటే గాంధీజీ అనుసరించిన మార్గంలో నడిస్తే చాలు. ఆశ, దురాశ, అవినీతి, ఆడంబరం... ఇవన్నీ లేకపోతే జీవితం సులభంగా ఉంటుందని చెప్పే సినిమా ‘లగే రహో మున్నాభాయ్‌’. 2006లో వచ్చిన ఈ సినిమా గాంధీజీని కొత్త తరానికి మరోసారి పరిచయం చేసింది. అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను రాజ్‌ కుమార్‌ హిరాణి సాధించాడు. వీధి రౌడీగా ఉండే ఒక వ్యక్తి గాంధీ ప్రభావంతో ఎలా మారాడనేది కథ. సంజయ్‌ దత్‌ హీరో.

గాంధీ మై ఫాదర్‌:  ఇది మొదట తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. మహాత్ములు విశాల ప్రజానీకం కోసం ఎన్ని త్యాగాలు చేసినా కుటుంబం దృష్టికోణంలో వాళ్లేమిటి అనేది కూడా ముఖ్యమే. మహాత్మునిగా గాంధీజీ ఆరాధ్యనీయుడు. కాని సొంత కొడుకు దృష్టిలో ఆయన గొప్ప తండ్రిగా ఉన్నాడా? గాంధీ కుమారుడు హరిలాల్‌ తన తండ్రి గాంధీలా లేదా గాంధీ అనుయాయుల్లా ఏనాడూ వెలుగులోకి రాలేదు. తండ్రి మీద ఎన్నో ఫిర్యాదులు పెట్టుకున్నాడు. అతని ఆత్మకథ ఆధారంగా తీసిన సినిమా ‘గాంధీ మై ఫాదర్‌’. 2007లో వచ్చిన ఈ సినిమాలో గాంధీ కుమారుడు హరిలాల్‌గా అక్షయ్‌ ఖన్నా నటించాడు.

గాంధీ: మన మహాత్ముని సినిమాను మన దర్శకులు తీయలేకపోయినా బ్రిటిష్‌ డైరెక్టర్‌ తీశాడు. ఏ బ్రిటిషర్ల మీద గాంధీజీ పోరాడారో ఆ బ్రిటిష్‌ జాతి నుంచి అటెన్‌ బరో వచ్చి ఈ సినిమా తీసిప్రాయశ్చిత్తం చేసుకున్నాడని భావించాలి. గాంధీ జీవితంపై సినిమా తీసేందుకు 1952 తర్వాత నుంచి ప్రయత్నాలు జరిగాయి. రిచర్డ్‌ అటెన్ బరోనే 1960ల్లోనే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 1980 నవంబర్‌లో అటెన్ బరో ఈ సినిమా షూటింగ్‌ప్రారంభించారు. 

1981 మే నెలలో షూటింగ్‌ పూర్తి అయింది. గాంధీ పాత్రను బెన్  కింగ్‌స్లే పోషించారు. నెహ్రూ పాత్రలో రోషన్‌ సేథ్, గాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే పాత్రలో హర్‌‡్ష నాయర్‌ నటించారు. 1982 నవంబర్‌ 30న ఢిల్లీలో విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమాను అమెరికా, బ్రిటన్ లలో కూడా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు గొప్ప స్పందన వచ్చింది. గొప్ప కలెక్షన్లు సాధించింది. ఆస్కార్‌ పురస్కారాలను గెలుచుకుంది. మహాత్మాగాంధీని తెరపై కళ్లకు కట్టినట్లు చూపిన బెన్  కింగ్‌స్లేకి ఆస్కార్‌ అవార్డు లభించింది.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)