Breaking News

ఆషాఢ గజానన సంకష్ట చతుర్థి : విశిష్టత, లాభాలు

Published on Wed, 07/24/2024 - 10:17

ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని గ‌జాన‌న‌ సంకష్ట చతుర్థి  అంటారు. ఎంతో భక్తితో జరుపుకునే పండుగ.  ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం (క్షీణించే దశ) చతుర్థి (నాల్గవ రోజు) నాడు వస్తుంది. సంక‌ష్ట‌ చతుర్థి అంటే కష్టాలను నాశనం చేసేదని అర్థం. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథిని సంక‌ష్ట‌ చతుర్థి అంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణ‌ప‌తి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడట.   అందుకే ఈ మాసంలో శివుడితోపాటు,  ఆయన కుమారుడైన వినాయకుడిని పూజిస్తారు. 

ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం వేళలో మహిళలు గణపతిని పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఈ ఉపవాసాన్ని ముగిస్తారు. అత్యంత భక్తిశ్రద్దలతో గణేశుని పూజించి రోజంతా  ఉపవాసం ఆచరిస్తారు. గణపతి వ్రత కథను చదువుకుని సాయంత్రం పూజలు చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రత మహిమ వల్ల అదృష్టం క‌లిసివ‌స్తుందని అన్ని అడ్డంకులను విఘ్న‌నాయ‌కుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. గజాన‌న సంక‌ష్ట‌ చతుర్థి నాడు దానధర్మాలు చేస్తారు.  అన్నార్తులకు అవసరమైన  ఇతర బహుమతులు అందించడం శుభప్రదంగా భావిస్తారు.  తద్వారా కష్టనష్టాలు తొలగి  ఆ గణుశుని ఆశీస్సులు లభిస్తాయని, సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మంచి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భావిస్తారు. 
 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)