Breaking News

అన్వేషణ

Published on Sun, 06/08/2025 - 01:27

మృగరాజు సింహం చిట్టికూన గుహ ముందు ఆడుకుంటూ తప్పిపోయింది.మధ్యాహ్నం బయటకి వెళ్లి ఇంటికి రాలేదు. చిట్టికూన బుల్లి ఎలుగు, గున్న ఏనుగుతో ఆడుకునేది. మృగరాజు వాటిని పిలిచి విచారించాడు. ‘రాజా! ఇప్పటి వరకు ఇక్కడే కలిసి ఆడుకున్నాం!’ అంది బుల్లి ఎలుగు. ‘చెరువుకు వెళ్లి నీళ్లు తాగి ఎవరింటికి వాళ్లం వెళ్లాం!’ అంది గున్న ఏనుగు. మృగరాజు వెంటనే చెరువుకు వెళ్లి వెతికాడు. కాని, చిట్టికూన కనిపించలేదు.

మృగరాజు వద్ద ఎంతోకాలంగా కొంగ, గుడ్లగూబలు గూఢచారులుగా కొలువు చేస్తున్నాయి.అవి అడవంతా తిరుగుతూ మృగరాజుకు రహస్య సమాచారాలు అందించేవి. మృగరాజు వెంటనే కొంగ, గుడ్లగూబలను పిలిపించాడు. మృగరాజు చెప్పేది వింటూనే కొంగ తన పొడవాటి మెడను నలుదిక్కులా తిప్పి పరిశీలించింది. వెంటనే ఎగిరి చెరువుకు పోయింది. చెరువు నుంచి గుహకు వస్తూ మర్రిచెట్టు దగ్గర ఆగింది.

తన పదునైన నేత్రాలతో చుట్టూ పరికించి చూసింది. ఒక్క క్షణం ఆలోచించి వెంటనే గుహకు వచ్చి ‘ప్రభూ! చిట్టికూన తప్పిపోలేదు. ఎవరో ఎత్తుకు పోయారు!’ అంది కొంగ. ‘ఎత్తుకు పోయారా?’ లేచి నిలుచుంది సింహం.‘వేగులుగా మా ప్రతిభ మీకు తెలియంది కాదు. చిట్టికూన జాడ చిటికెలో కనిపెడతాం! మీరు నిశ్చింతగా ఉండండి!’ అంటూ గుడ్లగూబతో కలిసి గాలిలోకి ఎగిరింది కొంగ.అవి రెండూ వెళ్లి మర్రిచెట్టు మీద వాలాయి. 

‘మిత్రమా! చిట్టికూనను నక్క ఎత్తుకుపోయి ఉండవచ్చు. నక్క పాద ముద్రలు మృగరాజు గుహ చుట్టుపక్కల కనిపించాయి. నాకు అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లాను. అవే పాదముద్రలు చెరువు దగ్గర కనిపించాయి. ఇక చిట్టికూన పాదముద్రలు, నక్క పాదముద్రలు పక్కపక్కనే ఈ మర్రిచెట్టు వరకే ఉన్నాయి. మర్రిచెట్టు దగ్గర చిట్టికూన పాదముద్రలు మాయమయ్యాయి. ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా కేవలం నక్క పాదముద్రలు ఉన్నాయి!’ పాదముద్రలు చూపిస్తూ వివరించింది కొంగ. 

పాదముద్రల వైపు పెద్ద పెద్ద కళ్లతో పరిశీలనగా చూసి చదునైన గుండ్రని తలను ఊపింది గుడ్లగూబ.‘మిత్రమా! చీకటి పడింది. నేను చీకట్లో ప్రయాణించలేను. చీకట్లో నీ దృష్టి, వినికిడి శక్తి అసాధారణం. ప్రత్యేకమైన నీ ఈకలతో నిశ్శబ్దంగా ఎగరగలవు. పాదముద్రల వెంట నక్క ఇంటికి వెళ్లి తనఖీ చేసిరా! పో..!’ అని పంపింది కొంగ.పాదముద్రలు పట్టుకొని నక్క గుహ దగ్గరకు చేరింది గుడ్లగూబ. గుహ బయట చిట్టికూన మల మూత్రాలను గమనించింది.

గుహ లోపల గుర్రు పెట్టి నిద్రపోతుంది నక్క పక్కనే కట్టేసిన చిట్టికూన కనిపించింది.ఇంతలో తెల్లారింది. గుడ్లగూబను వెతుక్కుంటూ. మృగరాజు వెంట కొంగ రానే వచ్చింది. ‘రాజా! పక్క అడవి పులిరాజు  చిట్టికూనను తెచ్చి ఇస్తే ఆ అడవికి మంత్రిని చేస్తానంటే ఆశతో ఎత్తుకొచ్చాను! నన్ను చంపొద్దు! మన్నించండి!’ అని కాళ్లు పట్టుకుంది. మృగరాజు నక్కకు అడవి బహిష్కరణ శిక్ష విధించాడు. వేగులైన కొంగ, గుడ్లగూబలు వేగంగా అన్వేషించి చిట్టికూనను కాపాడినందుకు అభినందించాడు మృగరాజు.

-భార్గవి

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)