గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
తరుచూ పెరుగు వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!
Published on Wed, 07/13/2022 - 08:20
వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లలో పెరుగు కలిపి వాడడం సర్వసాధారణం. పెరుగు చర్మనిగారింపుని పెంచడంతోపాటు, ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తొలగిస్తుంది. ఈ రెండు కారణాలతోనే ఎక్కువగా ఫేస్ ప్యాక్‌లలో పెరుగుని వాడుతారు. అలాగని తరచూ పెరుగు వాడడం వల్ల చర్మానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
- జిడ్డు చర్మతత్వం ఉన్న వారు పెరుగుని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గడానికి బదులు పెరుగుతాయి. ఎందుకంటే ముఖం మీద ఉన్న రంధ్రాలు పెరుగు వల్ల మరింత తెరుచుకుని మొటిమలు వస్తాయి. వేసవి, వర్షాకాలంలో పెరుగు వాడకం ఎక్కువగా ఉంటే మొటిమల సమస్య తీవ్రం అవుతుంది.
- పెరుగులో ప్రోటిన్, ల్యాక్టోజ్, క్యాల్షియం, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్నాయని రాత్రి సమయంలో పెరుగు తింటే చర్మసమస్యలు పెరుగుతాయి.
- శరీరం మొత్తంలో ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇంతటి సున్నితమైన చర్మంపై పుల్లటి పెరుగు అప్లై చేస్తే మంట, దురద, దద్దుర్లు వస్తాయి. పెరుగుని ముఖానికి రాసి ఎక్కువసేపు ఉంచుకోకూడదు. జిడ్డు చర్మంపై పెరుగు రాస్తే చర్మం మరింత జిడ్డుగా మారుతుంది.
- కొంతమందికి పాలు, పాల ఉత్పత్తులు సరిపడవు. ల్యాక్టోజ్ అలెర్జీని కలుగజేస్తుంది. ఇటువంటి వారు ఫేస్‌ప్యాక్‌లలో కూడా పెరుగుని వాడకపోవడమే మంచిది. ఫేస్‌ప్యాక్‌లలో పెరుగు వాడితే మరిన్ని చర్మసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
#
Tags : 1