Breaking News

బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ వెండింగ్‌ మెషీన్స్‌.. ఎక్కడో తెలుసా?

Published on Sat, 05/18/2024 - 12:07

సన్‌స్క్రీన్  లేకుండా ఎండలోకి వెళ్లడమా..! నో వే..అంటారు అమ్మాయిలు కదా. చర్మ కేన్సర్‌ బారిన పడకుండా రక్షించుకునేందుకు ఇది మేలైన మార్గం కూడా. అయితే హడావుడిలోనో.. లేదా ఖర్చు అవుతుందనో కొంతమంది సన్‌ స్క్రీన్‌ను పెద్దగా వాడరు. బహుశా అలాంటి వారి కోసమేనేమో నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఒక కొత్త  సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ ను అందించే  ఏర్పాట్లు చేసింది.   తద్వారా ప్రజలను కేన్సర్‌ బారి నుంచి  రక్షించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిస్తోంది. భూ ఉత్తరార్ధగోళంలో న్ని చోట్ల సూర్యకిరణాల్లో హానికారక అతినీల లోహిత కిరణాలు  ఎక్కువగా ఉంటాయి.  వీటితో చర్మ కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నది తెలిసిందే. 

ఈ క్రమంలోనే నెదర్లాండ్స్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ డిస్పెన్సర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు,  క్రీడా వేదికలు, ఉద్యానవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సన్ క్రీమ్ డిస్పెన్సర్‌లను అందుబాటులో ఉంచుతోంది.  దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో చక్కర్లు  కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 80  లక్షల మంది చూసేశారు. చర్మ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేలా చూడాలని నెదర్లాండ్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇటీవలి సంవత్సరాలలో చర్మ కేన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే, పళ్లు తోముకున్నట్లే చిన్నప్పటి నుండే సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల మాట.

> అయితే ట్వీపుల్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. అద్భుతం.. ఉచితంగా ఇస్తే ఇంకా మంచిదని కొందరనగా,  ఇవి ఫ్రీ కేన్స్‌ర్‌ మెషీన్స్‌ అంటూ వ్యంగ్యంగా మరికొందరు కమెంట్‌ చేశారు.  సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, సూర్యుడు మన శరీరంలోని చొచ్చుకెళ్లే రసాయనాలను నాశనం చేసేలా  చేద్దాం అంటూ మరికొరు  సమాధానమిచ్చారు.

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు