Breaking News

న్యూయార్క్‌ బెస్ట్‌ రెస్టారెంట్‌లుగా ఆ నాలుగు భారత రెస్టారెంట్లు!

Published on Fri, 04/05/2024 - 18:09

న్యూయార్క​ టైమ్స్‌ 2024 ఏడాదికి న్యూయార్క్‌ నగరంలో చక్కగా తినేందుకు అత్యుత్తమమైన రెస్టారెంట్ల జాబితాలను విడుదల చేసింది. న్యూయార్క్‌లో రెస్లారెంట్లపై అభిరుచిగల పీట్‌వెల్స్‌ అనే ప్రముఖ వ్యక్తి ఈ వంద అత్యుత్తమ బెస్ట్‌ రెస్టారెంట్ల జాబితాను ఎంపిక చేశారు. వాటిలో భారతీయ వంటకాలను అందించే నాలుగు రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఆ అత్యుత్తమ రెస్టారెంట్లలలో గ్రీన్‌విచ్‌ విలేజ్‌లో ఉండే సెమ్మా అనే  రెస్టారెంట్‌ టాప్‌ 10లో ఏడో స్థానంలో ఉంది.

గతేడాది ఇదే రెస్టారెంట్‌ 12వ స్థానంలో ఉంది. ఈ సెమ్మా రెస్టారెంట్‌ని చెఫ్‌ విజయకుమార్‌ నిర్వహిస్తున్నారు. ఆయన మంచి సౌత్‌ ఇండియన్‌ వంటకాలను అందిస్తున్నారు. అలాగే మాన్‌హట్టన్‌ దిగువ తూర్పు వైపునున్న ధమాకా 54వ స్థానంలో ఉంది. దీనికి చెఫ్ భాగస్వామి చింతన్ పాండ్యా , రెస్టారెంట్ రోనీ మజుందార్ కలిసి నిర్వహిస్తున్నారు. క్వీన్స్‌లోని టెంపుల్ క్యాంటీన్ 80వ స్థానంలో నిలిచింది. ఇది హిందూ దేవాలయం నేలమాళిగలో ఉంది. ఇది సంప్రదాయ దక్షిణాది వంటకాలను అందిస్తుంది. 

మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని హైదరాబాదీ జైకా న్యూయార్క్ నగరంలోని టాప్‌ 100 ఉత్తమ రెస్టారెంట్‌లలో చివరి భారతీయ రెస్టారెంట్. ఇది 95వ స్థానంలో ఉంది. ఇది బిర్యానీలకు ప్రత్యేకత గాంచిన రెస్టారెంట్‌. ఈ మేరకు పీట్‌ వెల్స్‌ అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితా తోపాటుగా చివర నోట్‌లో ఇలా రాశాడు. అందులో.."న్యూయార్క్ ఒక పెద్ద నగరం. ఇక్కడ ప్రజలు తమ పరిసరాలకు సమీపంలో మంచి రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేలా ఈ టాప్‌ 100 బెస్ట్‌ రెస్టారెంట్‌ల జాబితాను లిస్ట్‌ చేశాను. ఈ జాబితాతో కావాల్సిన వంటకాలు దొరికే రెస్టారెంట్‌లు ఏంటో కూడా ఈజీగా తెలుసుకోగలరు. చక్కగా రుచులను ఆస్వాదించగలరు అని రాశారు పీట్‌ వేల్స్‌.

(చదవండి: యంగ్‌ హీరోలకు ధీటుగా మాధవన్‌.. ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)