Breaking News

కోటీశ్వరుడు అవ్వడమే శాపమైంది..!

Published on Tue, 02/04/2025 - 17:49

డబ్బే జీవితంగా బతుకుతుంటారు కొందరూ. అందుకోసం తన పర అనే తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. బంధాలన్నింటిని డబ్బుతోనే చూస్తారు. నిజానికి అదొక స్టాటస్‌ ఆఫ్‌ సింబల్‌. కాస్త డబ్బు పలుకుబడి ఉంటేనే సమాజంలో గౌరవం కూడా. అయితే అదే డబ్బు మనిషికి కొంచెం కూడా మనశ్శాంతిని, నమ్మకమైన వ్యక్తులను ఇవ్వలేదు అనే నిజం తెలిసేలోపే అన్నింటిని కోల్పోతాం. ఏం కావాలో తెలియక మనో వ్యధకు గురవ్వుతాం. అచ్చం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు ఓ మిలియనీర్‌. పాపం డబ్బే సర్వం అనుకున్నాడు ఇప్పుడదే అతడికి మనశ్శాంతిని దూరం చేసింది. 

అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన జేక్ కాసన్ అనే కాలేజ్‌ డ్రాపౌట్‌ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికాడు. సంపదే తనకు ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్మాడు. అందుకోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాడు. చిన్న వయసులోనే లాస్ ఏంజిల్స్‌కు చెందిన యాక్సెసరీ బ్రాండ్ MVMT వాచెస్‌ కంపెనీని స్థాపించాడు. అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడు. 27 ఏళ్ల వయసుకి తన బ్రాండ్‌కి ఉన్న ఇమేజ్‌ చూసి ఏకంగా రూ. 871 కోట్లకు విక్రయించాడు. 

మిలియనీర్‌గా మారాలన్న అతడి కల నెరవేరింది. కానీ అదే అతడికి కష్టాలు, కన్నీళ్లని తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే కోటీశ్వరుడు అయ్యాడో అక్కడ నుంచి వ్యక్తిగత జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. జస్ట్‌ 30 ఏళ్లకే వైవాహిక జీవితంలో బ్రేక్‌అప్‌లు, ఏదో లక్ష్యం కోల్పోయినట్లు మనశ్శాంతి లేకపోవడం తదితరాలు చుట్టుముట్టాయి. 

అయితే అతడికి ఎందరో ప్రాణ స్నేహితులు ఉన్నా.. తన ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయి. ఏదో కావాలన్న ఆరాటం..కానీ ఏం కావాలో తెలియక ఒక విధమైన నైరాశ్యంతో కొట్టుమిట్టాడాడు. చివరికి అదికాస్తా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. "డబ్బే అనందాన్ని ఇస్తుందనుకుని కష్టపడి స్థాపించిన కంపెనీని అమ్మేశాను అదే నేను చేసిన తప్పు. వ్యవస్థాపక ప్రయాణం అత్యంత అమూల్యమైనది. ఒక కంపెనీని స్థాపించి దాన్ని నెంబర్‌ వన్‌ స్థాయిలో నిలబెట్టడంలో ఉన్న ఆనందం కిక్కు వేరు. 

డబ్బులు పోగేసుకోవడంలో లేదనే విషయం గ్రహించేలోపే..వ్యక్తిగతంగా అత్యంత ముఖ్యమైన మనశ్శాంతిని కోల్పోయా". అంటూ విలపిస్తున్నాడు కాసన్. అందుకే మళ్లీ పనిలో పడాలని నిర్ణయించుకుని యూట్యూబ్‌ చానెల్‌ పెట్టే ఆలోచన చేస్తున్నాడు. అలాగే తన బ్రాండ్‌కి పెట్టుబడిదారుడిగా ఉండాలని చూస్తున్నాడు. 

ఇతడి స్టోరీ ఓ గొప్ప విషయాన్ని చాటి చెప్పింది. "డబ్బు వెంట పరిగెడితే మనశ్శాంతి ఉండదు..కష్టపడటంలోనే ఆత్శసంతృప్తి ఉంటుందనే సత్యాన్ని చాటి చెబుతోంది కదూ..!. అయినా అవసరానికి మించిన ధనం కూడా చేటేనేమో..!."

(చదవండి: ఎవరీ పూనమ్‌ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి..!)

 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)