గర్భంతో ఉన్నాం కదా అని.. అన్నీ లాగించేయకూడదు!

Published on Wed, 09/11/2024 - 17:59

మన ఇంట్లోకి  చిన్ని బుజ్జాయి రాబోతోంది అంటే అటు కాబోయే తల్లిదండ్రులతోపాటు, ఇరు కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలు నెలకొంటాయి. అయితే తొమ్మిది నెలలు నిండి, పండంటి బిడ్డ పుట్టేదాకా కొంచెం ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా  గర్భం ధరించినమహిళల్లో ఎన్నో తెలియని సందేహాలు,  భయాలు ఉంటాయి.  

ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం జోలికి వెళ్లకూడదు లాంటి సందేహాలుంటాయి.  ఒక విధంగా చెప్పాలంటే సౌష్టికాహారం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, తాజాగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. శిశువుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు  లభించేలా జాగ్రత్త పడాలి. అలాగే వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన సప్లిమెంట్లను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, బిడ్డ ఎదుగుదల, కదలికలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించుకోవడమే పాపాయికి  శ్రీరామ రక్ష. అయితే సురక్షితమైన, ఆరోగ్యకరమైన  బిడ్డ కావాలంటే మాత్రం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు  తల్లీ బిడ్డకోసం అంటూ మరీ ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. మన ఆకలిని బట్టి మాత్రమే తినాలి.  లేదంటే అజీర్తి,కడుపు ఉబ్బరం లాంటి  సమస్యలొస్తాయి.  అలాగే మసాలాలు, ఉప్పు,కారం, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా తగ్గించాలి. 

ఆహారం, జాగ్రత్తలు
కోలిఫాం బాక్టీరియా, టాక్సోప్లాస్మోసిస్ , సాల్మొనెల్లా లాంటి హానికరమైన బాక్టీరియా సోకే ప్రమాదం ఉన్నందున గర్భధారణ సమయంలో  పచ్చి లేదా, ఉడికీ ఉడకని ఆహారం జోలికి వెళ్ల కూడదు.  వీటికి కారణంగా ఒక్కోసారి   గర్భస్రావం లేదా అకాల జననం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలకు దారి తీస్తాయి.  

పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు మంచిది కాదు  పాలు, గుడ్లు పౌష్టికాహారం. కానీ పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు.  అందుకే పూర్తిగా ఉడికిన గుడ్డు, మరిగించిన పాలను తీసుకోవాలి.

శుభ్రం చేయని పండ్లు, కూరగాయలు: తాజాగా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిని వండేటపుడు, వాటిని శుభ్రంగా కడగాలి. లేదంటే వాటిపై ఉండే  పురుగుమందుల అవశేషాలు, రసాయనాలు బిడ్డకు హానికరంగా మారతాయి. 

కొన్ని రకాలు చేపలు : మెర్క్యురీ  ఎక్కువగా ఉండే చేపలకు దూరంగా ఉండాలి. ఇవి శిశువు  నాడీ వ్యవస్థకు హాని చేస్తాయి. సొరచేప, కత్తి చేప, కింగ్ మాకేరెల్, టైల్ ఫిష్ వంటి కొన్ని రకాల చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, ట్రౌట్, సార్డినెస్ వంటి తక్కువ మెర్క్యురీ  చేపలను పరిమితంగా తినవచ్చు.

కూల్‌  డ్రింక్స్‌, ప్రాసెస్డ్ ఫుడ్‌ కూడా తగ్గించాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపైప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా మద్యం, ధూమపానాన్ని పూర్తిగా మానివేయాలి. ఓపిక ఉన్నంత వరకు, కనీసం అరగంట వ్యాయామం  చేయవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు కూడా వేయవచ్చు.
 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)