Breaking News

భారతదేశంలోని 5 విశిష్ట గ్రామాలు

Published on Mon, 06/08/2026 - 09:46

భారతదేశం అంత వైవిధ్యభరితమైన వాతావరణం, సంప్రదాయాలు, ఐక్యత, భిన్నత్వం, భాషలు, ఆహార అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమిపై మరొకటి లేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు తమ ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి ఐదు విశిష్ట గ్రామాల గురించి తెలుసుకుందాం.

1. ఖోనోమా, నాగాలాండ్‌
భారత్‌లో తొలి గ్రీన్‌ విలేజ్‌గా గుర్తింపు పొందిన ఖోనోమా ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుంది. ఇక్కడి ప్రజల సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక ఐక్యత ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

2. మాలినోంగ్, మేఘాలయ
ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందిన మాలినోంగ్‌లో ఎక్కడా చెత్త కనిపించదు. మేఘాలయలోని ఈ అందమైన గ్రామం షిల్లాంగ్‌కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఖాసీ తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు.

3. చిట్కుల్, హిమాచల్‌ ప్రదేశ్‌
భారత్‌–టిబెట్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న చివరి గ్రామంగా చిట్కుల్‌ ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, సాంప్రదాయ ఇళ్లు, స్వచ్ఛమైన గాలి ఈ గ్రామాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.

4. లంబసింగి, ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని ‘ఆంధ్రా కాశ్మీర్‌‘ అని పిలుస్తారు. ఎండాకాలంలో కూడా చల్లని వాతావరణంతో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందింది.

 5. బానవాసి, కర్ణాటక
కర్ణాటకలోని బానవాసి చారిత్రకప్రాధాన్యం కలిగిన పురాతన గ్రామం. కదంబ రాజవంశానికి తొలి రాజధానిగా నిలిచిన ఈప్రాంతం రెండు వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది.

పరిశుభ్రతకు మాలినోంగ్, పర్యావరణ పరిరక్షణకు ఖోనోమా, హిమాలయ సౌందర్యానికి చిట్కుల్, ప్రకృతి ప్రశాంతతకు లంబసింగి, 
చారిత్రక వైభవానికి బానవాసి ప్రతీకలుగా నిలుస్తాయి. భారతదేశం ఎంత వైవిధ్యభరితమైనదో ఈ గ్రామాలు మరోసారి మనకు గుర్తు చేస్తాయి. ఒకసారి వీటిని సందర్శిస్తే జీవితాంతం గుర్తుండి΄ోయే అనుభవాలను సొంతం చేసుకోవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)