Breaking News

ఐక్యరాజ్యసమితికి తెలుగు యువ ప్రతిభ

Published on Thu, 07/11/2024 - 00:50

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో  రాబోయే డిసెంబర్‌లో జరిగే 8వ వార్షిక 1ఎమ్‌1బి  (1మిలియన్‌ ఫర్‌ 1బిలియన్‌) యాక్టివేట్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొనడానికి తెలంగాణలోని వివిధ కాలేజీలకు చెందిన ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు.  

వీరిలో నలుగురు అమ్మాయిలు–  నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి,  సత్యవతి కోలపల్లి, మనల్‌ మునీర్‌ కాగా  మరొకరు మీత్‌కుమార్‌ షా ఉన్నారు. వీరి ఆవిష్కరణలకు  ‘1ఎమ్‌1బి గ్రీన్‌స్కిల్స్‌ అకాడమీ’ వేదికయ్యింది.  ఐదు నెలలపాటు సాగిన ఈ ప్ర్రక్రియలో 200 మంది  పాల్గొనగా ఐదుగురు తెలుగు విద్యార్థులు ఎంపికై  యువ ప్రతిభ కు ప్రేరణగా నిలిచారు.

పట్టణ సవాళ్ల పరిష్కారం
‘మానిఫెస్టింగ్‌ మ్యాన్ హోల్స్‌’ పేరుతో పట్టణ వరదలు, సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగాప్రాజెక్ట్‌ను ఆవిష్కరించాను.  భారతీయ నగరాల్లో మౌలిక సదుపాయాల 
భద్రతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. 
– నారాయణం భవ్య

టెక్‌.. టూర్‌
‘ఇంటెలినెక్సా’ అనే నాప్రాజెక్ట్‌ ఎకో–టూరిజంను ఏఆర్, వీఆర్, ఏఐల ద్వారా మార్చేందుకుæవీలుగా ఫీచర్లను అందిస్తోంది. వైల్డ్‌ లైఫ్‌ ట్రైల్స్, వీఆర్‌ అడ్వెంచర్స్, ఎకో కెరీర్‌ గైడ్స్, ఎకో డైరీస్‌ ద్వారా మనప్రాంతాల పట్ల సమాజానికి అవగాహన కల్పించడం, గ్లోబల్‌ ఫోరమ్‌లపై ప్రభావం చూపడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించాను.
– మనల్‌ మునీర్‌

లక్ష్యానికి మార్గం
‘అప్నా ఇంటర్వ్యూ క్రాకర్‌’ అనే నాప్రాజెక్ట్‌ మార్కెట్‌ ట్రెండ్‌లు, పోర్ట్‌ఫోలియో క్రియేషన్, ఎటిఎస్‌ రెజ్యూమ్‌ టెంప్లేట్‌లు, ఓపెన్‌ సోర్స్‌ కంట్రిబ్యూషన్ లను అందించే ఒక వేదిక. దీని ద్వారా ఎంతోమంది తమ లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.  
– మీత్‌ కుమార్‌ షా

విద్యార్థులకు ప్రాక్టికల్‌ స్కిల్స్‌
‘టెక్‌.వెసాలియస్‌’ అనే నాప్రాజెక్ట్‌ లక్ష్యం అనాటమీ విద్యలో ఎఆర్‌/విఆర్‌ సాంకేతికత ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా, వారిలోప్రాక్టికల్‌ స్కిల్స్‌ పెంపొందించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం. 
– పెమ్మసాని లిఖిత చౌదరి

వాస్తవ అనుభూతి
నారు పోషణలో ఏఐ సాధనాలు, మెటా స్పార్క్‌ స్టూడియోని ఉపయోగించుకొని వాస్తవ అనుభూతిని ఎలా పొందవచ్చో నాప్రాజెక్ట్‌ పరిచయం చేస్తుంది. అంతేకాదు కెమెరా ట్రాకింగ్‌ ద్వారా వినియోగదారులకు వారి మొక్కలను సేంద్రీయంగా, వేగంగా ఎలా పెంచాలనే దానిపై లింక్‌లు, మార్గదర్శకాలను అందిస్తుంది. మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్ట్‌ ఇది. 
– సత్యవతి కోలపల్లి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)