Breaking News

మృగశిర కార్తెకు-చేపలకు ఉన్న సంబంధం? ఆ రోజే చేపప్రసాదం ఎందుకుంటే..

Published on Wed, 05/27/2026 - 10:33

ప్రతీ ఏడాది మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొన్ని రోజుల్ల చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. మృగశిర కార్తె రోజే చేపమందు ఎందుకు పంపిణీ చేస్తారంటే..

అప్పుడే ఎందుకు?
మృగశిర కార్తె ప్రవేశించిన సమయంలో ఎండలు తగ్గుతాయి. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప్రారంభమవుతాయి. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో వేడి పెంచడానికి మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారు. 15 రోజుల పాటు శరీరం చల్లగా ఉండటంతో తగినంత వేడి కోసం చేపలను ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. వాతావరణం మారటంతో.. ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో.. జనాల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణశక్తి సైతం తగ్గుతుంది. 

జ్వరం, దగ్గు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు. ఉబ్బసం సమస్యతో బాధపడేవారికి ఈ కార్తె ప్రారంభమైన 2 రోజులపాటు హైదరాబాద్‌లో చేప ప్రసాదం ఇవ్వడం తెలిసిందే. మరోవైపు ఈ కార్తెకు రెండు మూడు రోజుల ముందు నుంచే చేపల మార్కెట్లలో రద్దీ పెరుగుతుంది. అయితే మృగశిర కార్తె ప్రారంభమైన రోజునే.. చేప ప్రసాదం ఇస్తే బాధితులకు సరిగ్గా పని చేస్తుందని నమ్మకం.

చేపలకు మృగశిరకు ఉన్న సంబంధం..
రోళ్లను సైతం పగులగొట్టే భగమండే ఎండలు తగ్గిపోతాయి. తొలకరి జల్లులతో వర్షాలు మొదలవుతాయి. అదీగాక 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. 

ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్‌లోచాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే.

చేప మందు చరిత్ర..
ఈ మందును మొదట 1847లో తయారు చేశారు. అప్పట్లో ఓ సాధువు దేశపర్యటన చేస్తూ హైదరాబాద్​ పాతబస్తీకి వచ్చారు. ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా బత్తిని వీరన్నగౌడ్​ ఆయనకు ఆశ్రయం కల్పించారు. ఆ సమయంలోనే చేప మందు తయారు చేశారు. ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తే నీకు అన్ని విధాలా మంచి జరుగుతుందని చెప్పి తయారు చేసే విధానం ఆయనకు వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బత్తిని కుటుంబ సభ్యులు ఈ మందును పంపిణీ చేస్తున్నారు.

ఇందులో ఏం ఉంటాయంటే..
ఈ చేపప్రసాదం కోసం చిన్న చిన్న కొరమీను చేపలనే వాడతారు. ఈ మందులో పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు, ఇతర వనమూలికలు ఉంటాయి.

చేప ప్రసాదం (ఫిష్ ప్రసాదం) అనేది ఉబ్బసం (ఆస్తమా) ఇతర శ్వాసకోశ వ్యాధుల నివారణకు హైదరాబాద్‌లోని బత్తిని కుటుంబం సుమారు 170 ఏళ్లుగా పంపిణీ చేస్తున్న ఒక ప్రసిద్ధ సాంప్రదాయ మందు. ఈ ప్రసాదాన్ని ప్రతి ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం రుతుపవనాల ప్రారంభాన్ని సూచించే మృగశిర కార్తి రోజున నిర్వహిస్తారు.  ఈ ఏడాది జూన్‌ 8 నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (హైదరాబాద్)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

బత్తిని కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా సుమారు 2 అంగుళాల పరిమాణంలో ఉన్న చిన్న 'కొరమీను' చేప నోటిలో ప్రత్యేకమైన పసుపు పసరు (మందు) పెట్టి, దానిని రోగి గొంతులోకి జొప్పిస్తారు. శాకాహారులకు, చేపలు తినలేని వారికి ఈ మందును బెల్లంతో కలిపి ఇస్తారు. ఈ మందు పూర్తిగా ఉచితం, కానీ రోగులు బయట స్టాళ్లలో దొరికే చిన్న చేపలను సొంతంగా కొనుగోలు చేసి తీసుకురావాలి. మందు తీసుకున్న తర్వాత 30 నిమిషాల వరకు నీరు త్రాగరాదు. ఈ మందు ప్రభావం చూపడానికి బత్తిని కుటుంబం సూచించిన 45 రోజుల కఠినమైన ఆహార నియమాలు (డైట్) ఖచ్చితంగా పాటించాలి.

(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

 

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)

+5

ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు)