Breaking News

శారీ.. ఫర్‌ ఎవర్‌

Published on Wed, 10/30/2024 - 11:01

నగరం ఓ మినీ ఇండియా. నార్త్, సౌత్, నార్త్‌ ఈస్ట్‌తో పాటు మధ్య భారతం, పశి్చమ, వాయువ్య భారతం అంతా కనిపిస్తుంది. నోరు విప్పి మాట్లాడిన తరవాత భాషను బట్టి వారిది ఏ రాష్ట్రమో తెలుస్తుంది. కానీ మహిళల వస్త్రధారణ మౌనంగా మాట్లాడుతుంది. ఇండియన్‌ ఫ్యాషన్‌ అవుట్‌ ఫిట్‌లో చీరది ప్రత్యేకమైన స్థానం. చీరలకు అతి పెద్ద షోకేస్‌ హైదరాబాద్‌ నగరం. వెస్టర్న్‌ ప్యాటర్న్స్‌ ఎన్ని వచి్చనా వాటిని స్వాగతిస్తూనే ఉంది. 

పాతికేళ్ల కిందట ఒక టేబుల్‌ వేసుకుని కాటన్‌ వస్త్రం మీద అందమైన డిజైన్లను అద్దడంతో చీర కొత్త పుంతలు తొక్కింది. అప్పటి వరకూ చేనేతకారులు తరతరాల సాదా మోడల్స్‌ దగ్గరే ఉన్నారు. సూరత్‌లోని టెక్స్‌టైల్‌ మిల్స్‌ ఒక డిజైన్‌ రూపొందిస్తే ఆ డిజైన్‌లో వేలాది చీరలు దేశమంతటా విస్తరించేవి. అలాంటి సమయంలో ఒక చీరకు అద్దిన డిజైన్‌ మరో చీరలో ఉండకూడదని, వేటికవే వినూత్నంగా ఉండాలని మహిళా డిజైనర్లు చేసిన ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. ప్రతిదీ యూనిన్‌గా ఉండాలని కోరుకునే మహిళలకు ఈ ప్రయోగం ఓ వరంలా కనిపించింది. డిజైనర్లు రూపొందించిన డిజైన్లకే పరిమితం కాకుండా సొంత డిజైన్లు గీసి మరీ చేయించుకోవడం మొదలైంది. క్రమంగా అద్దకం ఓ ట్రెండ్‌ అయ్యింది. చీరను ట్రెండ్‌ నుంచి పక్కకు పోనివ్వకుండా కాపాడుకుంటూనే ఉంది మెట్రో ఫ్యాషన్‌. పాతికేళ్లుగా హైదరాబాద్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ని గమనిస్తున్న ప్రముఖ డిజైనర్‌ గాయత్రి రెడ్డి చెబుతున్న మాట ఇది.  

నేతలో క్రియేటివిటీ.. 
చీర మీద అద్దిన డిజైన్‌ హైలైట్‌ కావడానికి డిజైన్‌ అవుట్‌ లైన్‌ ఎంబ్రాయిడరీ చేయడం మరో ప్రయోగం. అక్కడి నుంచి మగ్గం వర్క్‌ మొదలైంది. చీరతోపాటు బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీ, చీర కంటే బ్లౌజ్‌కు పెద్ద ఎంబ్రాయిడరీ, బ్లౌజ్‌కు హైలైట్‌ కావడానికి ప్లెయిన్‌ చీర కాంబినేషన్‌ వంటి ప్రయోగాలన్నీ సక్సెస్‌ అయ్యాయి. ఇదే సమయంలో మహిళా డిజైనర్లు తమ క్రియేటివిటీని చేనేత వైపు మళ్లించారు. పోచంపల్లి, ఇకత్‌ నుంచి నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, పాటూరు వంటి నేతలన్నింటికీ ఫ్యాషన్‌ లుక్‌ తెచ్చారు. దాంతో ఫ్యాషన్‌ ప్రపంచాన్ని చేనేత శాసించేంతగా డిజైన్‌లు పాపులర్‌ అయ్యాయి. పట్టు చీరల బరువు తగ్గించడంలో విజయవంతమయ్యారు. దాదాపు క్రేప్‌ మాదిరి తేలిగ్గా ఉంటోందిప్పుడు.

వాతావరణం మారింది 
నగరంలో ఏడాదిలో పది నెలలు చల్లని వాతావరణం ఉండేది. ఈ పాతికేళ్లలో బాగా మార్పులు వచ్చాయి. ఏడాదిలో పది నెలలు వేడిగా ఉంటోంది. వెదర్‌కు అనుకూలంగా ఉండేటట్లు డిజైనర్‌ శారీస్‌ కాటన్‌లో తీసుకురావడం కొత్త తరం మహిళలు చీరపై మోజు పడడానికి ఓ కారణం. చీర కట్టే రోజులు తగ్గినా.. కొనడం మాత్రం తగ్గలేదు. ప్రతి ఫంక్షన్‌కీ ఓ కొత్త చీర కొనే ట్రెండ్‌ వచ్చేసింది. సాఫ్ట్‌వేర్‌ ఉమర్స్‌ పారీ్టలకు చీరలో మెరిసిపోతున్నారు. రోజూ చుడీదార్‌ ధరించే వాళ్లు కూడా బర్త్‌డే పార్టీ, గెట్‌ టు గెదర్‌ వంటి వాటికి చీర కడుతున్నారు.  

చీర చుట్టూ ఫ్యాషన్‌..
పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో నూటికి 70 నుంచి 80 శాతం మహిళలు రోజూ చీరలే ధరించేవారు. క్రమంగా 2015 నాటికి 40 శాతానికి పరిమితమైంది. వర్కింగ్‌ ఉమెన్స్, డాక్టర్లు, లెక్చరర్లు చీరలతోనే డ్యూటీ చేశారు. ఇప్పుడిది పాతిక శాతం మాత్రమే ఉంది. ఆధునిక వనితల వార్డ్‌రోబ్‌లో చుడీదార్, జీన్స్‌ డైలీ వేర్‌ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ చీర మాత్రం  దూరం కాలేదు. తనను తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్‌గా మారుతోంది చీర. అందుకే శారీఫ్యాషన్‌ ఎప్పటికీ తెరమరుగు కాదు.  

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు దృష్టి..

పచ్చ కుట్ర జోరు.. రూ.600, బిర్యానీ ప్యాకెట్లు.. ఎన్నికల వేళ విద్యార్థులకు ఎర..

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

Photos

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌