Breaking News

ఫెస్ట్‌@ ఫామ్‌..

Published on Mon, 01/13/2025 - 07:14

సంక్రాంతి తెలుగుదనానికి, స్వచ్ఛమైన పల్లె వాతావరణానికీ ప్రతీక. అందమైన రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. భోగిమంటలు.. స్వచ్ఛమైన పిండివంటలు.. హరిదాసు పాటలు.. గంగిరెద్దుల విన్యాసాలతో వెల్లివిరిసే ఆనందోత్సాహాలతో సందడిగా జరుపుకుంటాం.. ఇలాంటి అందమైన వేడుకకు పల్లెను మించిన వేదిక మరొకటి ఉండదు. అందుకే నగరవాసులు ప్రతి పండుగకూ పల్లెకు పయనమవుతారు. సంవత్సరం పొడవునా చేసుకొనే రొటీన్‌ వేడుకలకు ఇది భిన్నం.. అయితే ఇటీవలి కాలంలో.. పల్లెకు వెళ్లలేని వారు ఫామ్‌హౌస్‌లలో సంక్రాంతి సంబరాలకు కుటుంబ సమేతంగా తరలివెళ్తున్నారు. దీంతో నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు సంక్రాంతి సందడికి వేదికవుతున్నాయి. బంధువులు, స్నేహితులతో కలిసి సంక్రాంతి విడిది కేంద్రాల్లో సరదాగా సేదదీరుతున్నారు. దీంతో నగర శివారులోని సిద్ధిపేట్, గండిపేట్, చేవెళ్ల, వికారాబాద్, కడ్తాల్‌ వంటి ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లలో సంక్రాంతి సందడి నెలకొంది..ఆ విశేషాలు..    

సంక్రాంతి అంటే సరదగా సాగే వేడుక.. బంధువులు.. పిండి వంటలు.. ఆటలు.. పాటలు.. ముచ్చట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి.. ఓ రకంగా సంక్రాంతి సంబరాలు అంటే అంబరాన్ని తాకేలా ఉంటాయి.. దీంతో ఒత్తి జీవనానికి అలవాటుపడిన నగరవాసులు కనీసం రెండు మూడు రోజులు నగరానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.. అందుకే ‘భోగి రోజు కంటే ముందే ఫామ్‌హౌస్‌కు చేరేవిధంగా ప్లాన్‌ చేసుకున్నాం’.. అని ఉప్పల్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు. తెల్లవారు జామున నిద్రలేచి భోగిమంటలు వేసుకొని, అందమైన ముగ్గుల నడుమ వేడుకలు చేసుకోవడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ తరహా వేడుకలు జరుపుకునే వారికోసం నగర శివారులోని ఫామ్‌ హౌస్‌లు వేదికలుగా 
మారుతున్నాయి.

సకల సదుపాయాలు.. 
రోజుకు కనిష్టంగా రూ.3000 నుంచి గరిష్టంగా రూ.10,000 వరకూ అద్దెకు ఫామ్‌హౌస్‌లు లభిస్తున్నాయి. ఇందులో స్విమ్మింగ్‌ పూల్స్, క్రీడా ప్రాంగణాలు, కేర్‌టేకర్‌ వంటి హై సెక్యూరిటీతో సకల సదుపాయాలూ కలి్పస్తున్నారు. దీంతో ఇటీవల పల్లె వాతావరణాన్ని ఇష్టపడే వారు ఈ ఫామ్‌ హౌస్‌ల కేంద్రంగా వేడకలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్‌ పెరిగి 
యజమానులు అద్దెలు పెంచడం గమనార్హం.

పతంగుల పండుగ.. 
సంక్రాంతి పండుగ రైతులకు ఎంత ముఖ్యమైనదో.. పిల్లలకూ అంతే ప్రధానమైనది. కాంక్రీట్‌ అరణ్యంలా మారిన నగరంలో పతంగులు ఎగరేయడం ఓ సవాల్‌. దీంతో విశాలమైన మైదానాలు, భవనాలపై నుంచి పతంగులు ఎగరేస్తారు. ఇది పూర్తి స్థాయి ఆనందాన్ని కలిగించదు.. అందుకే ఫామ్‌ హౌస్‌లలో పతంగుల పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విశాలమైన పొలాలు, పచి్చక బయళ్లలో పిల్లలు గంటలతరబడి పతంగులతో కాలం గుడుపుతారు.. ‘పిల్లలకు ప్రకృతి, వ్యవసాయం, ఆహార ఉత్పత్తి గురించి తెలియజెప్పాలి. అందుకే ఫామ్‌ హౌస్‌లను ఎంపిక చేసుకున్నాం’ అని ఈసీఐఎల్‌కు చెందిన చంద్రశేఖర్‌ చెబుతున్నారు. 

‘రియల్‌’ సంస్థల ప్రత్యేక ఏర్పాట్లు.. 
నగవాసుల ఆసక్తి, అభిరుచిని గుర్తించిన ‘రియల్‌’ సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వెంచర్‌లో కొంత స్థలాన్ని పండుగ వాతావరణం ఉట్టిపడేవిధంగా డిజైన్‌ చేసి అద్దెకు ఇస్తున్నారు. ఇటు వెంచర్‌లకు ప్రచారం.. అటు ఆదాయం రెండూ సమకూరుతున్నాయి. తద్వారా గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లలో ఉండే  నగరవాసులు ఫామ్‌హౌస్‌ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)