అనుసృజన

Published on Sun, 12/15/2024 - 10:50

అను పెళ్లకూరు.. ఫ్యాషన్‌ రంగంలో బాగా వినబడే పేరు. ఫ్యాషన్‌పై ఆమెకున్న పిచ్చి పద్దెనిమిదేళ్ల వయసులోనే మిస్‌ యూఏఈ ఫైనలిస్ట్‌ కోసం దుస్తులను డిజైన్‌ చేసే కాంట్రాక్ట్‌ను తెచ్చిపెట్టింది. కేవలం రూ. పదిహేను వేలతో అద్భుతమైన మూడు డిజైన్స్‌ను అందించి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు, తన పేరును ఫేమస్‌ ఫ్యాషన్‌ డిజైనర్స్‌ జాబితాలో చేర్చుకుంది.

ఫ్యాషన్‌పై ఉన్న ప్యాషన్‌తో ఇంటర్‌ అయిపోయిన వెంటనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో జాయిన్‌ అయింది అను. కానీ, ఆ రంగంలో ఆచరణాత్మక అనుభవం చాలా ముఖ్యమని గ్రహించింది. దాంతో తరగతులకు హాజరవక.. కాలేజ్‌ డ్రాప్‌ అవుట్‌గా మిగిలింది. తన అభిరుచిని గైడ్‌గా తలచి, అనుభవాన్ని పాఠాలుగా మలచుకుంది. సోదరుడు సూర్య సహకారంతో ‘ఎస్‌ అండ్‌ ఏ (సూర్య అండ్‌ అను)’ పేరుతో ఓ మల్టీ డిజైనర్‌ స్టోర్‌ను ప్రారంభించింది. మరోవైపు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి దుస్తులను డిజైన్‌ చేయడం మొదలుపెట్టింది. అలా పాపులారిటీ సంపాదించుకోవడంతోపాటు తన డిజైన్స్‌ సెలబ్రిటీల కంట పడేలా చేసుకుంది. అది వర్కవుట్‌ అయి.. సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్‌ చేసే చాన్స్‌ కొట్టేసింది. 

నిహారిక కొణిదెల, రుహానా శర్మ, వితికా షేరు, రెజీనా కసాండ్రా, ఈషా రెబ్బ, వైష్ణవి చైతన్య వంటి సెలబ్రిటీలందరికీ అను పెళ్లకూరు ఫేవరిట్‌ డిజైనర్‌ అయింది. ఆ ప్రోత్సాహంతోనే ‘తనాషా’ పేరుతో సొంత బ్రాండ్‌ను స్థాపించింది. అంతేకాదు, ఇటీవల ప్రతిష్ఠాత్మక బాంబే టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ‘స్వర్ణిరహ’ పేరుతో తన లేటెస్ట్‌ కలెక్షన్స్‌ను ప్రదర్శించి.. ప్రశంసలు అందుకుంది. ఆ ఈవెంట్‌కు గ్లామర్‌ను జోడిస్తూ ప్రఖ్యాత నటీమణులు శ్రియా సరన్, మృణాల్‌ ఠాకూర్‌ షో స్టాపర్స్‌గా ర్యాంప్‌ వాక్‌ చేశారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి రెండింటి మేళవింపుగా ఉండే ఆమె డిజైన్స్‌కు స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ గుర్తింపు లభించింది. దుబాయ్, శ్రీలంక, సింగపూర్‌ దేశాల్లో జరిగిన పలు ఫ్యాషన్‌ షోస్‌లో అను తన డిజైన్స్‌ను ప్రదర్శించింది.

అనుభవాన్ని మించిన గురువు ఉండరు. అది నాకు చాలా నేర్పింది. మొదట్లో ఎన్నో సవాళ్లను, ఇంకెన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని నమ్మాను. అదే నిజమైంది.
– అను పెళ్లకూరు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)