Breaking News

26 కేసులు గెలిచిన 'నకిలీ' లాయర్

Published on Sun, 03/29/2026 - 05:49

ఎవరైనా కాస్త గడుసుగా మాట్లాడినా.. తర్కంతో ప్రశ్నించినా..‘పట్టా’ లేని ప్లీడరు అంటారు. బయట ప్రశ్నించడానికి, అవతలి వాళ్లను నిలదీయడానికి ‘పట్టా’ అక్కర్లేదు. కానీ కోర్టులో అలా కాదు, కోటుంటే సరిపోదు.. న్యాయవిద్య చదివుండాలి.. సెక్షన్లూ తెలిసుండాలి. 

ఓ వ్యక్తి పట్టా లేకపోయినా కోర్టులో వాదించాడు. కేసులూ గెలిచాడు. చివరికి అతని బండారం బయటపడింది. గుట్టు రట్టయ్యింది. జీవితం జైలు పాలైంది. అయినా ‘తగ్గేదేలే ’ అంటూ కోర్టును అభ్యర్థించాడు. తన కేసును తనే వాదించు కున్నాడు. షరతులతో కూడిన బెయిల్‌ పొందాడు. అలాగని ఇది విజయ గాథ కాదు, తీసేయదగ్గదీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తెలుసుకోదగ్గ అంశంగా మారింది. కెన్యాలో ఈ ఉదంతం జరిగింది.

న్యాయవాదిగా కోర్టులో వాదించాలంటే ఏ దేశంలో అయినా న్యాయ విద్యను అభ్యసించాలి. సంబంధిత కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకోవాలి..అప్పుడే అర్హత వస్తోంది. కెన్యాలో కూడా అంతే. న్యాయవాదుల నమోదును ‘లా సొసైటీ ఆఫ్‌ కెన్యా’ పర్యవేక్షిస్తోంది. ఇందులో పేర్లు నమోదు అయిన వారు మాత్రమే ప్లీడరుగా ప్రాక్టీసు చేయాలి. బ్రియాన్‌ మ్వెండా న్త్విగా అనే వ్యక్తి ‘లా సొసైటీ ఆఫ్‌ కెన్యా’లో అడ్వకేట్‌గా రిజిస్టర్‌ అయ్యాడు.

మోసానికి బీజం పడిందిక్కడే
బ్రియాన్‌ న్త్విగా వివరాలను బ్రియాన్‌ మ్వెండా న్జాగీ అనే వ్యక్తి టాంపర్‌ చేసి అక్కడ తన ఈమెయిల్‌ నమోదు చేశాడు, ఫొటో మార్చాడు. ఇలా పట్టా లేకుండానే ప్లీడర్‌ అయ్యాడు. లోయర్‌ కోర్టు నుంచి హయ్యర్‌ కోర్టుల వరకు కేసులు వాదించాడు. సుమారుగా 26 కేసుల్లో విజయం కూడా సాధించాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రాక్టీసు కొనసాగించాడు.

ఎలా బయటపడింది
బ్రియాన్‌ మ్వెండా న్త్విగా ‘లా సొసైటీ ఆఫ్‌ కెన్యా’లో లాగిన్‌ అవ్వడానికి ప్రయత్నించగా ఓపెన్‌ కాలేదు. తన వివరాలు మారిపోయినట్టు గుర్తించి, లా సొసైటీ ఆఫ్‌ కెన్యాకు ఫిర్యాదు చేశాడు. అధికారులు దర్యాప్తు చేశారు. ఓ వ్యక్తి అక్రమంగా తన పేరును బ్రియాన్‌ న్త్విగా వివరాల్లో నమోదు చేసినట్టు గుర్తించారు. 

కేసు నమోదు
అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. న కిలీ లాయరు జైలు కెళ్లాడు. కేసు విచారణ మొదలైంది. కోర్టును అభ్యర్థించి తన కేసు తనే వాదించుకోవడం సంచలనంగా మారింది. తన ‘నకిలీ’ అనుభవం అక్కరకు వచ్చింది. షరతులతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

భిన్నాభిప్రాయాలు
నకిలీ లాయర్‌కు కొందరు బాసటగా నిలిచారు. అతని తెలివితేటల్ని మెచ్చుకున్నారు. న్యాయ విద్య చదివితే మరింతగా రాణిస్తావని సలహా ఇచ్చారు. మరికొందరు.. ఇది ప్రమాదరకరమైందన్నారు.  లాయర్ల రిజిస్ట్రేషన్‌లోని డొల్లతనాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఈ ఘటన కెన్యాలో న్యాయవ్యవస్థపై చర్చకు దారి తీసింది.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. గతంలో అతడు విజయం సాధించిన 26 కేసుల్లోనూ సాక్ష్యాలు బలంగా ఉండడంతో కోర్టులు వాటి పునఃసమీక్షకు అంగీకరించకపోవడం కొసమెరుపు.

-దిలీప్‌ మాదిరెడ్డి

#

Tags : 1

Videos

ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?

వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్

చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)