Breaking News

అమ్మకు రెండు తరాల బరువు

Published on Thu, 05/07/2026 - 00:26

కూతురి కాలేజ్‌ ఫీజు ఒకవైపు... మామగారికి పక్షవాతం మరోవైపు... 50 దాటిన మహిళలు ఇలా ఒకేసారి రెండు తరాల మధ్య స్ట్రెస్‌ అనుభవిస్తున్నారు. దీనినే ‘శాండ్‌విచ్‌ జనరేషన్  స్ట్రెస్‌’ అంటారు. భర్తతో అడ్జస్ట్‌ అవడం, మెనోపాజ్‌ సమస్యలు ఇందుకు అదనం. ఒక సర్వే ప్రకారం అర్బన్  ఇండియాలో  35 శాతం మహిళలు ఇలా పిల్లలూ పెద్దల మధ్య నలుగుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ఒక అమ్మ ఏం చేసింది?

ఆమెలాంటి అమ్మను మనం చాలామందిని చూసి ఉంటాం. వయసు 49 ఏళ్లు. హైదరాబాద్‌లో స్కూల్‌ అడ్మిన్‌గా ఉద్యోగం. మధ్యతరగతి జీవితం. ఈమె చన్నీళ్లకు భర్త సంపాదన వేణ్ణీళ్లు. ఇద్దరూ సంపాదించకపోతే బండి నడవదు. ఆమె పని ఉదయం ఏడుకే మొదలైపోతుంది. గిన్నెలు, టిఫిన్‌ వండటాలు... చేయదగ్గవే. కాని అత్తగారిని చూసుకోవాలి. డెబ్బై అయిదేళ్ల అత్తగారికి డైపర్‌ మార్చడం, మందులు వేయడం, టిఫిన్‌ తినేలా చూసి ఆ తర్వాత లంచ్‌ బాక్స్‌ రెడీ చేసుకొని ఆఫీసుకు పరుగు పెట్టడం... ఒకరోజు కాదు రెండు రోజులు కాదు... నిత్యం.

ఆఫీసులో ఉండగా కూతురి ఫోన్‌ వస్తుంది. కాలేజీ ఫీజు గురించి. కొడుకు ఫోన్‌ వస్తుంది... దొరకని ఉద్యోగం గురించి... చేరాల్సిన కోర్సు గురించి. ఆఫీసులో బాసు పని మీద పని చెప్తుంటాడు. అలిసి సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ డ్యూటీ. అత్తగారికి డిన్నర్, కూతురికి కౌన్సెలింగ్, కొడుకుకి మోటివేషన్‌. రాత్రి పదకొండుకు మంచం మీద వాలితే ఆమెకు కలిగే భావన ఏమిటి?

ఆమెలో మార్పులు
రోజులు గడిచే కొద్దీ ఆమెలో మార్పులు వచ్చాయి. అవి ఆమె అదుపులో లేవు. ఏమిటవి? ఎవరిని చూసినా కోపం రావడం. అత్తగారు మంచం తడిపితే అరిచేసి తర్వాత గిల్టీ ఫీల్‌ అయ్యి ఏడవడం. రోజురోజుకూ ఖర్చులు పెరిగి ఇప్పుడే రూపాయి మిగలకపోతే నాకు అరవై వచ్చేసరికి ఏం మిగులుతుంది అనే ఆందోళన. అద్దంలో చూసుకుంటే తనకు తానే గుర్తు పట్టని రూపం. మెనోపాజ్‌ చికాకు, నడుము నొప్పి, బి.పి...  ఒకరోజు ఆఫీస్‌లో కళ్లు తిరిగి పడిపోయింది. డాక్టర్‌ ఆమె సంగతి అంతా గ్రహించి ‘మీరు ఇప్పుడు మారకపోతే, మీ అత్తగారి పక్క బెడ్‌ మీదే మీరుంటారు’ అన్నాడు. ‘మీకూ జీవితం ఉండాలి. మీరు అమ్మగా మాత్రమే బతుకుతున్నారు’ అన్నాడు.

మొదలైన మార్పు
డాక్టర్‌ మాటతో ఆమెలో ఆలోచన రేగింది. ఒక స్నేహితురాలి సహాయంతో ఒక సైకాలజీ కౌన్సిలర్‌తో మాట్లాడింది. ‘శాండ్‌విచ్‌ జనరేషన్‌ స్ట్రెస్‌’ గురించి కొంత క్లారిటీ తెచ్చుకుంది. కొన్ని మార్పులు చేసుకుంది. జీవితం అంటే తనకు తాను మిగిలేలా బతకడం అనే ఎరుక తెచ్చుకుంది. ఈ అమ్మ మరి ఏం చేసింది?

‘సూపర్‌ ఉమన్‌’ టైటిల్‌ వదిలేసింది
కుటుంబ సభ్యులతో మీటింగ్‌ పెట్టి భర్త, కొడుకుతో ఖచ్చితంగా చెప్పింది– ‘నేను ఒక్కదాన్నే చేయలేను. మీరు కూడా చేయాలి’. ఇప్పుడు ఉదయం అత్తగారి మందులు భర్త బాధ్యత. సాయంత్రం భోజనం కొడుకు పెడతాడు. డైపర్‌ మార్చే పనిలో కూతురు సాయం పడుతుంది. సాయం అడగడం బలహీనత కాదు, తెలివి అని ఆమెకు అర్థమైంది.

తనకంటూ రెండు రోజులు
నెలకు రెండు రోజులు... అంటే ఆదివారాలు తను పూర్తి విశ్రాంతి తీసుకోదలిచింది. ఆ రెండురోజుల కోసం ఒక హోమ్‌ నర్స్‌ను అత్తగారి కోసం ఏర్పాటు చేస్తుంది. అలాగే వంట పూర్తిగా బంద్‌ చేసి పిల్లలు చేసేదో బయటి నుంచి తెచ్చేదో ఉండాలంటోంది. ఆ రెండు రోజులు సినిమా, నిద్ర, ఫ్రెండ్స్‌తో కబుర్లు. ఆ రెండు రోజుల బలంతో మిగిలిన 28 రోజులు లాగించగలుగుతోంది.

ఆర్థిక బరువు తగ్గించి
కూతురితో స్పష్టంగా చెప్పింది– ‘ఈ సెమిస్టర్‌ ఫీజు కడతాను. నెక్స్‌ట్‌ సెమిస్టర్‌ నుంచి ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకో. నా రిటైర్మెంట్‌ ఫండ్‌ ఖాళీ అయితే, రేపు నేను మీ మీద భారం అవుతాను’. కొడుక్కి కూడా కోర్సులు చేరాలంటే పార్ట్‌టైమ్‌ చేసి సంపాదించు అని.

తన సమయం– ‘మీ’ టైమ్‌
రోజులో తన సమయం కొంత ఉండాలనుకుంది. ప్రతిరోజూ ఉదయం కాసేపు టెర్రస్‌ మీద నిలబడి కాఫీ తాగుతుంది. ఆ టైమ్‌లో చేతిలో ఫోన్‌ ఉండకూడదు, వేరే ఆలోచనలు ఉండకూడదు. అలాగే సాయంత్రం డిన్నర్‌ తర్వాత కాసేపు పచార్లకు సమయం. 6 నెలల తర్వాత ఆమె బి.పి. కంట్రోల్‌లోకి వచ్చింది. అందరూ దారికి వచ్చారు. నేను నా జీవితాన్ని కాపాడుకున్నాను అనుకుంది ఆ  అమ్మ. కాదు మహిళ. కాదు కాదు ఒక జీవని.

Videos

విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు

ఏమయ్యా చంద్రబాబు.. అకాల వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏంటి?

నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు

118 మందితో రా.. విజయ్ కి గవర్నర్ భరోసా..

విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్

VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం

వర్మ ఏంటి ఈ కర్మ.. ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ..! KSR డీటెయిల్ అనాలసిస్

తమిళనాడు సీఎం విజయ్..?

కరీంనగర్‌లోని BRS క్యాంప్ కార్యాలయంపై BJP దాడి

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)