Breaking News

మానవ జల నిర్మాణాల్లో.. ఇది కూడా ఒక అద్భుతం!

Published on Mon, 06/15/2026 - 13:38

ఈ భూమిపై ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అందులో కొన్ని సహజంగా ఏర్పడినవయితే, మరికొన్ని మానవ మేధస్సుతో నిర్మితమైనవి. మారుతున్న కాలానుగుణంగా నూతన పరిఙానంతో కూడిన మానవ నిర్మాణాల్లో 'పనామా కాలువ' కూడా ఒకటి. దీని గురించి చూసినట్లయితే..

ప్రపంచంలో మానవులు నిర్మించిన జలమార్గాల్లో ఇదొక అద్భుత నిర్మాణం. ఇది (Panama Canal) మధ్య అమెరికాలోని పనామా దేశంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అలాగే, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ 82 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్న జలమార్గం. పొడవు సుమారు 82 కిలోమీటర్లు, వెడల్పు సాధారణంగా 91 మీటర్ల నుండి 300 మీటర్ల వరకు మారుతుంది. లోతు సుమారు 12 నుండి 15 మీటర్లు. మూడు ప్రధాన లాక్ప్‌.. గాటూన్ లాక్స్, పెడ్రో మిగెల్ లాక్స్, మిరాఫ్లోరెస్ లాక్స్ సిస్టమ్‌ ని కలిగిఉంది. ప్రయాణ సమయం.. 8 నుండి 10 గంటలు పడుతుంది.

ఎలా పనిచేస్తుందంటే?
పనామా కాలువ కేవలం లాక్స్‌ సిస్టంతోనే పనిచేస్తుంది. ఈ కాలువ వద్ద భూమి సముద్రమట్టం కంటే ఎత్తుగా ఉండగా.. ఈ నిర్మాణంతో ఓడలు పైకెత్తడం, కిందకు దించుతారు. కాలువలో పెద్ద పెద్ద నీటి గదులు లాక్స్‌ రూపంలో ఉంటాయి. ఇవి ఓడలు వచ్చినప్పుడు వాటి పరిమాణం తగ్గట్టుగా అటూ, ఇటూ జరుగుతుంటాయి. ఓడ ఒక లాక్‌ చాంబర్‌లోకి వెళ్లగానే గేట్లు మూసేస్తారు. మరో పక్కనుంచి నీటిని చాంబర్‌లోకి వదులుతూ, నీటి స్థాయి పెరిగేలా చేసి ఓడను పైకెత్తుతారు. ఈ విధంగా మూడు ప్రధాన లాక్స్‌ ద్వారా ఓడను పైకెత్తి.. సమాంతర స్థానానికి చేరగానే నీటి సహాయంతో ప్రయాణించేలా చేస్తారు.

తరువాత అట్లాంటిక్‌ నుంచి బయలు దేరిన ఓడలను చివరగా పసిఫిక్‌ వైపుగా దిగేలా చేస్తారు. ఈ కాలువ నీటి వంపులను వినియోగించకుండా కేవలం గురుత్వాకర్షణతోనే పనిచేయబడుతుంది. అంటే నీరు ఒక లెవెల్‌ నుంచి మరో లెవెల్‌ కు సహజంగా ప్రయాణించేలా దీని నిర్మాణం చేయబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక నీటి ఎలివేటర్‌ లాంటిదన్నమాట. సముద్ర మట్టాలు రెండు వైపులా వేరుగా ఉండటం, అలాగే, మధ్యలో ఎత్తైన భూభాగం ఉండటం వల్ల దీనిని 'లాక్ సిస్టమ్' ద్వారా నిర్మించారు. ఓడలు లాక్‌ల ద్వారా దాదాపు 85 అడుగుల ఎత్తుకు చేరుకుంటాయి. తరువాత గటూన్‌ సరస్సుపైగుండా ప్రయాణిస్తూ, అవతలి వైపు సముద్రమట్టానికి చేరుకుంటాయి. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత అట్లాంటిక్–పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఇదివరకున్న 9500 కిమీ కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడమే కాకుండా వాణిజ్య వ్యాపారాలకు సమయం ఆదా చేయడంలో ఈ పనామా కాలువ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)