Breaking News

మ్యారేజీ ఎంట్రీకి ఏజ్‌ ఏంటి?

Published on Fri, 06/27/2025 - 06:23

పెళ్లికి అర్హతను నిర్ణయించేది అబ్బాయికైతే కొలువు .. అమ్మాయికైతే వయసు! ఉద్యోగం వస్తే అబ్బాయి స్థిరపడినట్టు.. ఇరవై ఏళ్లు నిండితే అమ్మాయి పెళ్లితో స్థిరపడాలన్నట్టు! ఇవి పెళ్లికి సంబంధించిన సామాజిక ప్రమాణాలు.. సాంస్కృతిక కట్టుబాట్లూనూ! పెళ్లి వ్యక్తిగత నిర్ణయం. మానసిక పరిణతి, సంసిద్ధత, ఆర్థిక స్వాతంత్య్రమే దానికి అర్హతలు ఎవరికైనా అంటున్నారు నేటి తరం వనితలు!  ఆ చర్చే నేటి కథనం..

అనూష (పేరు మార్చాం)కు 30 ఏళ్లు. ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేసింది. మంచి కంపెనీలోనే ఉద్యోగం. నచ్చిన కారు కొనుక్కుంది. దేశ, విదేశాలు తిరుగుతూ ప్రపంచాన్ని ఎక్స్‌΄్లోర్‌ చేస్తోంది. త్వరలోనే ఫ్లాట్‌ కొనుక్కోవాలనే ప్లాన్‌లోనూ ఉంది. తోటివాళ్లంతా అబ్బాయిలు సహా.. ఆమెను ఓ అచీవర్‌గా చూస్తుంటారు.. ఇన్‌స్పైర్‌ అవుతుంటారు. కానీ అనూష తల్లిదండ్రులే దిగులుపడుతూ ఉంటారు. 

30 ఏళ్లు వచ్చినా పెళ్లిపేరు ఎత్తట్లేదని, అసలు పెళ్లి ఊసు ప్రస్తావించినా మండిపడుతోందని. బంధువుల పెళ్లిళ్లకు వెళితే ఆ తల్లిదండ్రులను ప్రశ్నలతో ముంచేస్తున్నారు అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా? వయసు మీద పడుతుంటే అమ్మాయిలు లావైపోతారు, ముందుముందు సంతానం కష్టమవుతుంది, అసలు కలగకపోనూ వచ్చు– అంటూ లేని భయాలను సృష్టిస్తున్నారు. అదంతా అమ్మాయి మీద ఒత్తిడిగా మారుతోంది.. ‘నీ తోటి వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్‌ అయిపోతున్నారు.. నువ్వేమో ఇల్లు కొనాలి, దేశాలు తిరగాలని ఊరేగుతున్నావ్‌’ అంటూ! ఇది నసలా అనిపించడంతో అనూష.. అమ్మానాన్నల దగ్గరకు రావడమే మానేసింది. 

ఇక్కడ అనూష ఒక ఉదాహరణ మాత్రమే! అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న అమ్మాయిలు ప్రతి ఇంట్లో ఉంటున్నారు. జీవితంలో సెటిల్‌ అవడం అంటే అబ్బాయిలకు ఎలాంటి నిర్వచనం ఉందో అమ్మాయిలకూ అలాంటి నిర్వచనమే ఉండాలని కోరుకుంటున్నారు. ఉద్యోగం వచ్చాక కూడా అబ్బాయిలు ఆర్థికంగా స్థిరపడటానికి టైమ్‌ ఎలా ఇస్తున్నారో అమ్మాయిలకూ ఆ సడలింపు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నిజమే కదా.. 
చదువు విషయంలో అమ్మాయిలకు అవకాశాలిస్తూ.. బాగా చదివేలా ఇటు కుటుంబాలు, అటు ప్రభుత్వాలూ వాళ్లను ప్రోత్సహిస్తూ మంచి ప్రయత్నానికి నాంది పలికారు. ఇప్పుడా ప్రయత్నం ఫలితాలనిస్తోంది అన్ని రంగాల్లో ఆడవాళ్ల ఉనికి చూపుతూ! మొదలుపెట్టాక గమ్యం చేరాలి కదా! ఆ ప్రయాణంలోనే ఉన్నారు నేటి అమ్మాయిలు. వాళ్లనుకున్న గమ్యం లేదా అచీవ్‌మెంట్‌ను సాధించే వరకు వేచి చూడమంటున్నారు. ఆ టైమ్‌ ఇవ్వమంటున్నారు. పెళ్లిని తమ జీవితాలకు పరమావధిగా చూ పొద్దంటున్నారు.. దానికిమించిన ఆలోచనలు, కార్యాచరణతో ముందుకుసాగుతున్న వాళ్లను మూడుముళ్లతో ఆ పొద్దంటున్నారు. 

అలాగని వాళ్లు పెళ్లిని వ్యతిరేకించడం లేదు. పెళ్లికి వయసుతో ముడిపెట్టిన సాంస్కృతిక కట్టుబాటును సవాల్‌ చేస్తున్నారు. వాళ్లు పెళ్లికన్నా తమ ఉద్యోగోన్నతి, మానసిక, భావోద్వేగాల పరిణతి, ఆర్థిక స్వాతంత్య్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లికి వయసు కన్నా మానసిక, ఆర్థిక సంసిద్ధతనే ప్రామాణికంగా చూస్తున్నారు.‘ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేసుకోవాలనేది ఒక మిత్‌. దాన్నొక కల్చరల్‌ ఎక్స్‌పెక్టేషన్‌లాగే భావిస్తున్నాం మ్యారేజ్‌ అనేది పర్సనల్‌ చాయిస్‌. ఎప్పుడు చేసుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయం. ఇంకా చె΄్పాలంటే పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం కానీ అదే జీవితం కాదు. అరే.. జీవితంలో సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచం చూడండి ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో.. దాంతో పోటీ పడాలి కదా!’ అంటోంది హైదరాబాద్‌కు చెందిన ఒక బిజినెస్‌ ఎనలిస్ట్‌.

మరి బయోలాజికల్‌ క్లాక్‌ మాటేమిటి? 
‘పిల్లలకేం అలాగే అంటారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అన్నారా? పెళ్లి సరైన వయసులో అయితేనే సంతానం కలుగుతుంది. లేకపోతే కనపడ్డ చెట్టు, పుట్టలకు మొక్కినా పిల్లలు పుట్టరు’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ‘అన్యాయం.. ఇలాంటి ఒత్తిళ్లతో అమ్మాయిలను అగౌరవ పరచకూడదు. అమ్మాయి విలువను పెంచేది ఆమె అమ్మ అవడం ఒక్కటే కాదుకదా!’ అని నొచ్చుకుంటున్నారు స్త్రీ వాదులు, సామాజిక విశ్లేషకులు. ‘బయోలాజికల్‌ క్లాక్‌ అనేది ఇదివరకటి మాట. ఇది కూడా ఒకరకమైన కల్చరల్‌ ఎక్స్‌పెక్టేషనే. 

సైన్స్‌ చాలా డెవలప్‌ అయింది. ఎగ్‌ ఫ్రీజింగ్‌ బ్యాంక్‌లు, ఆంబ్రియో ప్రిజర్వింగ్‌ సెంటర్సే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు. అవీ వీలుకాకపోతే దత్తత చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇన్ని ప్రత్నామ్యాయాల మధ్య కూడా బయోలాజికల్‌ క్లాక్‌ గురించిన భయం, సుదీర్ఘ చర్చ అవసరమా?’ అంటున్నారు ఇంకొంతమంది అమ్మాయిలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాల్సింది కుటుంబాలే! అమ్మాయిలకూ చదువు, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని వాళ్ల ఆశలకు రెక్కలు తొడిగినప్పుడు ఎగిరే స్పేస్‌నూ ఇవ్వాలి. పెళ్లి విషయంలో వాళ్ల నిర్ణయాలను గౌరవించాలి. వాళ్ల ఆలోచనలను అంగీకరించి తదనుగుణంగా ఇంటి ‘లా’ను మార్చాలి అని చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు.  

ఊహకందనంతగా సైన్స్‌ తద్వారా వైద్యరంగంలో మార్పులొస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఎగ్‌ ఫ్రీజింగ్‌. అమ్మాయిలు  పొటెన్షియల్‌ ఏజ్‌లో అండాలను ప్రిజర్వ్‌ చేసుకోవడమన్నమాట. ఇది.. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉన్న విమెన్‌కి వరం లాంటిది. ఒకరకంగా చె΄్పాలంటే రి్ర పొడక్టివ్‌ చాయిస్‌ని మహిళలు తమ నియంత్రణలో ఉంచుకోవడమన్నమాట. పెళ్లి, పిల్లలతో కెరీర్‌కి బ్రేక్‌ పడకుండా నేటి అమ్మాయిలకు యూజ్‌ఫుల్‌గా ఉంటోందీ ప్రక్రియ. దీనివల్ల వయసు అయిపోతోంది పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పిల్లలు పుట్టకపోయే ప్రమాదం ఉండొచ్చు వంటి భయాలకు చోటు లేదు. అంటే బయోలాజికల్‌ క్లాక్‌ ప్రెజర్‌ లేకుండా జీవితంలో వాళ్లనుకున్న లక్ష్యాల మీద మనసు పెట్టే వీలును కల్పిస్తుందిది. అంతేకాదు కెరీర్‌లో, పర్సనల్‌ చాయిసెస్‌లో జెండర్‌ ఈక్వాలిటీనీ సపోర్ట్‌ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రతికూల ప్రభావాలూ లేకపోలేదు. 
– డాక్టర్‌ ఆకుల దివ్య, ఎమ్‌డి, హైదరాబాద్‌ 

– సరస్వతి రమ

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు