Breaking News

అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Fri, 04/18/2025 - 12:01

ఇన్నాళ్లు వంటలు చేయగా మిగిలిన నూనెని తిరిగి వాడొద్దని హెచ్చరించేవారు. ఇప్పుడు ఏకంగా అసలు వంటనూనెలే వాడొద్దని వార్నింగ్‌ ఇచ్చేస్తున్నారు. పైగా అవి కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయంటూ.. విస్తుపోయే విషయాలు చెబుతున్నారు. ఇదేంటి ఇంకేం వాడాలి వంటకు అన్న అనుమానం రావడం సహజమే. కానీ తాజా పరిశోధనలు వంట నూనెలు కేన్సర్‌ ప్రమాదాన్ని ప్రోత్సహిత్సాయని చెబుతున్నాయి. అంతేగాదు అదెలా జరుగుతుందో కూడా సవివరంగా వివరించారు పరిశోధకులు.

వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనల్లో వంట నూనెలు, కూరగాయల నూనెలు అతిగా వాడకూడదని తేలింది. ఆ నూనెల్లో ఉండే  లినోలెయిక్ కేన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందట. ముఖ్యంగా రొమ్మ కేన్సర్‌(Breast Cancer)లోని కణాల్లో పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని తెలిపాయి. అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్‌ ప్రమాదాన్ని ఈ లినోయిక్‌ ఆమ్లం వేగవంతం చేస్తుందట. 

అంటే సాధారణ రొమ్ము కేన్సర్‌లో కంటే ఈ ట్రిపుల్‌ నెగటివ్‌లో కేన్సర్‌ కణాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఇక మనం వాడే ఈ నూనెలు ఆ కేన్సర్‌ కణాలను మరింత అభివృద్ధి చేస్తాయని గుర్తించామని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోయాబీన్‌, కుసుమ నూనె వంటి సీడ్స్‌ ఆయిల్స్‌, పందిమాంసం, గుడ్లు వంటి జంతువుల్లో కనిపించే ఒమేగా 6 కొవ్వు ఆమ్లం లినోలెయిక్ చికిత్స చేయడానికే కష్టతరమైన ట్రిపుల్‌ నెగిటివ్ రొమ్ము కేన్సర్‌ పెరుగదలను ప్రత్యేకంగా పెంచగలదని పరిశోధనలో నిరూపితమైందన్నారు. 

లినోలెయిక్ ఆమ్లం FABP5 అనే ప్రోటీన్‌తో బంధించడం ద్వారా కేన్సర్‌ కణితి కణాలను మరింత వేగంగా అభివృద్ధి చెందేలా సక్రియం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఇతర హార్మోన్‌ సెన్సిటివ్‌ ఉప రకాల్లో అలా జరగడం లేదు. 

అంటే ఇక్కడ లినోలెయిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారం కేన్సర్‌ కణితి పెరుగుదల మెరుగ్గా ఉంచుతుందని క్లియర్‌గా నిరూపితమైందన్నారు. ఈ పరిశోధన ఆహార కొవ్వులు, కేన్సర్‌ మధ్య సంబంధాన్ని వివరించడంలో సహాయపడటటేమ గాక నిర్దిష్ట పోషక సిఫార్సులు ఏ రోగులకు ఎక్కువ ప్రయోజనం అనేది క్లియర్‌ నిర్వచించగలమని అంటున్నారు పరిశోధకులు. 

(చదవండి: నలుగురిలో కలవనివ్వకుండా చేసే వ్యాధి.. ! గంటల్లోనే నయం అయిపోతుందట..)
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు