Breaking News

సెలూన్‌కి వెళ్లే పని లేకుండా..మీ హెయిర్‌ని స్ట్రయిట్‌ చేసుకోండిలా..!

Published on Tue, 08/01/2023 - 13:23

కర్లీ హెయిర్‌ అందమే వేరు. ఒక్కోసారి అది పొల్యూషన్‌ వల్లో మరే ఇతర కారణాల వల్లనో నిర్వీర్యంగా అయిపోతుంది. దువ్వినా దువ్వనట్లుగా చిందరవందరగా ఉంటుంది జుట్టు. వెంట్రుకలు రఫ్‌గా మారిపోయి చిక్కులు పడిపోతూ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అదీగాక కొందరికి స్ట్రయిట్‌గా కుచ్చుకుచ్చులుగా జాలు వారుతున్న జుట్టునే ఇష్టపడుతుంటారు. అందరూ సెలూన్‌కి వెళ్లి డబ్బులు పెట్టి మరి చేయించుకోవడం కుదరదు. ఒకవేళ చేయించినా మెయింటేన్‌ చేయించడం ఇబ్బంది. మళ్లీ మళ్లీ సెలూన్‌కి వెళ్తూ వారి చెప్పిన సెషన్‌లలో చేయించుకోవాల్సి కూడా ఉంటుంది. వాటన్నింటికి చెక్‌ పెట్టి జస్ట్‌ ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే ప్యాక్‌లు వేసుకుంటే ఈజీగా జుట్టు స్ట్రయిట్‌ అవ్వడమే గాక జుట్టుకి మంచి గ్రోత్‌ ఉండి కనీసం జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 

నేచురల్‌గా చేసుకునే హోం ప్యాక్‌లు ఏంటంటే..

  • మనం ఇంట్లో ఉపయోగించే పాలే తీసుకోండి. జస్ల్‌ ఒక కప్పు పాలు ఓ గుడ్డు తీసుకోండి. మీ జుట్లు బాగా పొడవైతే ఇంకో కప్పు పాగు, మరో గుడ్డు తీసుకోండి. ఇక ఈ రెండిటిని బాగా మిక్స్‌ అయ్యేలా కలిపిం బ్రెష్‌తో జుట్టుకి ప్యాక్‌ వేసుకోండి. ఓ అరంగంట తర్వాతా మీకు నచ్చిన షాంపుతో కడిగేయండి. మీరే ఆశ్చర్యపోతారు ఎంత సిల్కిగా జాలు వారుతుంటుందో మీ జుట్టు. 
  • కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిసిన విషయమే మీరు అరకప్పు కలబందను, అరకప్పు కొబ్బరి నూనెతో మిక్స​్‌ చేసి గంటపాటు అలానే ఉంచి షాంపుతో కడిగేయండి. చిట్లిన జుట్టు సమస్య తగ్గడమే గాక స్ట్రయిట్‌ అవుతుంది. 
  • మరొకటి యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ సహజమైన క్లెన్సర్‌ అని పిలుస్తారు. జుట్టుకి అప్లై చేస్తే అది మురికిని పోగొట్టడమే కాకుండా జుట్టుని మృదువుగా చేస్తుంది. మూడు టేబుల్‌ స్పూన్ల ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను రెండు కప్పుల నీటిలో కలపండి. ముందుగా మీ జుట్టుని షాంపుతో కడిగేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అప్లే చేసి రెండు మూడు నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేసుకుండి. ఇలా తరుచుగా చేస్తే త్వరితగతిన మీ జుట్టు స్ట్రెయిట్‌ అవుతుంది.
  • మొక్కజొన్న పిండి, కొబ్బరి పాల మిశ్రమాన్ని జుట్టుకి ప్యాక్‌లా వేసిన స్ట్రయిట్‌గా అవుతుంది. 

ఇవన్నీ వద్దు అంటే ఈ ప్యాక్‌ని ట్రై చేయండి ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడమే గాక చక్కగా స్ట్రయిట్‌ అవ్వుతుంది. అప్పటికప్పుడూ పార్టీల సమయంలో మీ జుట్టు స్ట్రయిట్‌ అవ్వడానికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది. 

ముందుగా ఈ ప్యాక్‌కి కావాల్సినవి: 
బియ్యం ఒక కప్పు 
కొబ్బరి ముక్కలు పావు కప్పు
నీరు  కప్పు
నానబెట్టిన మెంతులు 3 చెంచాలు
అలోవేరా జెల్ కొద్దిగా 
ఆలివ్ ఆయిల్ ఓ చెంచా

తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టండి. ఆ తర్వాత ఆ బియ్యాన్ని కడగకుండా అలానే ఉడికించండి. ఆ తర్వాత మిక్సి జార్‌లోకో ఉడికించిన బియ్యం, కొబ్బరిముక్కలు, అలోవేరా జెల్‌ వేసి మిక్సీ పట్టుకోండి. మెత్తటి పేస్ట్‌లా ఉండాలి. ఆ తర్వాత ఆలివ్‌ ఆయిల్‌ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి.. ఓ గంట పాటు ఉంచుకోండి. ఆ తర్వాత జుట్టుని మైల్డ్‌ షాంపుతో కడిగేయండి. ఆరిన తర్వాత చూస్తే జుట్టు స్ట్రైయిట్‌గా కుచ్చులా ఉంటుంది. ఇలా రెగ్యూలర్‌గా చేస్తే మాత్రం జుట్టు స్ట్రెయిట్‌ అయ్యి, ధృఢంగా ఉంటుంది. 

(చదవండి: ఏజెంట్‌ బ్యూటీ ధరించిన డ్రస్‌ ధర వింటే షాక్‌ అవ్వాల్సిందే!)
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)