Breaking News

నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు..

Published on Thu, 01/09/2025 - 17:18

ఓ టెక్కీ ఫ్యాషన్‌​ రంగంలోకి అడుపెట్టి అద్భుతమైన డిజైన్‌లను క్రియేట్‌ చేసి ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చాడు. మహామహా ఫ్యాషన్‌ డిజైనర్‌లకు పోటీ ఇచ్చేలా లెహాంగాలు తీర్చిదిద్ది ఫ్యాషన్‌ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏడాదికి రూ 5 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతూ స్టైలిష్‌ రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఎవరతను..? ఎలా ఈ రంగంలోకి వచ్చారు. 

మనీష్‌ మల్హోత్రా, అనామిక ఖన్నా, నాన్సి త్యాగి వంటి ప్రముఖ డిజైనర్లు భారతీయ ఫ్యాషన్‌ని తమదైన శైలిలో పునర్నిర్వచించారు. ఆ కోవలోకి సూరత్‌కి చెందిన మాజీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మయూర్‌ భరత్‌భాయ్‌(Mayur Bharatbhai) కూడా చేరిపోయాడు. ఆయన మహిళల కోసం తయారు చేసే ప్రసిద్ధ పెళ్లి లెహంగాల(Lehenga Business) బీఎల్‌ ఫ్యాబ్రిక్‌ వ్యవస్థాపకుడు. 

ఈ కంపెనీ మూడు రకాల ఎంబ్రాయిడరీ లెహంగాలను తయారు చేస్తుంది.  థ్రెడ్‌వర్క్, జరీ వర్క్, సీక్విన్‌ వర్క్‌లతో రూపొందిస్తుంది. ఈ కంపెనీకి చెందిన సెమీ-స్టిచ్డ్ లెహంగాలు చాలా సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయి. ఈస్టార్టప్‌ వెంచర్‌ తన ఉత్పత్తులను సాంప్రదాయ మార్కెట్ల కంటే దాదాపు 65% నుంచి 70% వరకు తక్కువ ధరకే విక్రయిస్తుంది. 

అంతేగాదు వినియోగదారులు తమకు నచ్చిన రీతిలో లెహంగాలను డిజైన్‌ చేయించుకునే వెసులబాటు కూడా అందిస్తోది. అందుకోసం ఈ కంపెనీలో దాదాపు 25 మంది అంతర్గత కళాకారుల బృందం ఉంటారు. ప్రస్తుతం ఈ ఎల్‌బీ ఫ్యాబ్రిక్‌ వద్ద దాదాపు 200 డిజైన్ల అద్భుతమైన కలెక్షన్లు ఉన్నాయి 

ప్రారంభమైంది..
మయూర్‌ తన దుస్తుల వ్యాపారాన్ని 2021లోనే ప్రారంభించారు. అంతకుముందు తన సోదరుడి దుస్తుల వ్యాపారంలో కొన్నాళ్లు పనిచేశారు. ఆయన సృజనాత్మకతతో కూడిన పనికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ ఆసక్తే ఆయన్ను సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి ఫ్యాషన్‌వైపు అడుగులు వేసేలా చేసింది. గతేడాది సెప్టెంబర్‌ నాటికి బీఎల్‌ ఫ్యాబ్రిక్‌ 10 శాతం నికర లాభల మార్జిన్‌తో సుమారు రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే ఈ కంపెనీ 2025 నాటికి రూ. 18 కోట్లకు చేరుకుంటుందని అంచనా. 

అంతేగాదు సోనీ టెలివిజన్‌ సీరీస్‌ షార్క్‌ట్యాంక్‌ ఇండియా 4(Shark Tank India 4)సీజన్‌లో న్యాయూమర్తులుగా వ్యవహరించే కునాల్ బహల్, రితేష్ అగర్వాల్ నుంచి కూడా 5% ఈక్విటీకి ఒక కోటి రూపాయల ఉమ్మడి షరతులతో కూడిన ఆఫర్‌ని అందుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అంతేగాదు ఈ షో కోసం తానే స్వయంగా డిజైన్‌ చేసిన దుస్తులను ధరించారు మయూర్‌. కుర్తా డిజైన్‌ కోసం నల్లటి ఫాక్స్ జార్జెట్ ఫాబ్రిక్‌ను ఎంచుకున్నారు. నీలం, గులాబీ, ఆకుపచ్చ , తెలుపు రంగుల బహుళ వర్ణ షేడ్స్‌లో సంక్లిష్టమైన ప్రకృతి-ప్రేరేపిత అలంకరణతో పరిపూర్ణ వైవిధ్యాన్ని అందించారు. ఒక ఇంజనీర్‌ ఫ్యాషన్‌ పరిశ్రమలో తన క్రియేషన్స్‌తో అద్భుతాలు సృష్టించి, ఆధాయాలు ఆర్జించడం విశేషం.

 

(చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!)

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)