Breaking News

గడ్డ కట్టే చలిలో 16 రోజులుగా ‘‘క్లైమేట్ ఫాస్ట్"

Published on Thu, 03/21/2024 - 13:58

లడఖ్‌కు చెందిన  ప్రముఖ సామాజిక, వాతావరణ కార్యకర్త మెగసెసే అవార్డు గ్రహీత, సోనమ్ వాంగ్‌చుక్ 'లడఖ్‌ను రక్షించేందుకు' నిరాహార దీక్షకు దిగారు. ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణోద్యమంలో స్వ‌రాన్ని వినిపిస్తున్న సోనమ్‌ ల‌డ‌ఖ్‌ను కాలుష్య కోర‌ల నుంచి  ర‌క్షించాలంటూ గత కొంత కాలంగా పోరాడుతున్నారు. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ భద్రత కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం, లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) నాయకుల మధ్య చర్చలు విఫలమైన  నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నాలుగేళ్లపాటు తూతూమంత్రంగా సాగిన వ్యూహాల తర్వాత, హామీలను నెరవేర్చేందుకు కేంద్రం నిరాకరించిందని వాంగ్‌చుక్ విమర్శించారు. 

వాతావరణ మార్పులను నిరసిస్తూ, లడఖ్‌లోని హిమాలయ ప్రాంతంలోని పర్యావరణ భద్రత, లడఖ్‌కు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ డిమాండ్‌తో మార్చి 6వ తేదీన మొదలైన ఈ ‘‘క్లైమేట్ ఫాస్ట్"  21 రోజులు పాటు కొనసాగనుంది. అవసరమైతే ఈ దీక్షను ఆమరణ దీక్షగా పొడిగించవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్  వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.

>

సాదాసీదాగాజీవనాన్ని ఎంచుకోవాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. సోనమ్ వాంగ్‌చుక్‌ క్లైమాట్‌ ఫాస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల పౌరులు, రాజకీయ నాయకులు, సామాజిక-పర్యావరణ కార్యకర్తలు మద్దతుగి నిలిచారు. అలాగే ఈయనకు  సంఘీభావంగా కాశ్మీర్ టూరిజం  విభాగం కూడా 'క్లైమేట్ ఫాస్ట్'లో పా ల్గొనడం విశేషం.  ఎప్పటికపుడు  దీక్ష వివరాలను  ట్వటర్‌లో షేర్‌ చేస్తున్నారు.   16 వ రోజు దీక్ష వివరాలను కూడా ఆయన పంచుకున్నారు.   

‘‘8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్టోగ్రత వద్ద 120 మంది ఆరుబయట నిద్రిస్తున్నారు. నీరు, లవణాలుకొద్దిగా తగ్గుతున్నాయి. నేను ఇంకా 25 రోజులు దీక్ష కొనసాగించగలను అని విశ్వసిస్తున్నాను. సత్యం గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ - సోనమ్ వాంగ్‌చుక్

కాగా ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌ల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటోంద‌ని, రాబోయే రోజుల్లో హిమానీ న‌దాలు అంత‌రించి పోయే ప్ర‌మాదం ఉందని ఇప్పటికే చాలా సార్లు హెచ్చ‌రించిన సోనమ్‌ అనేక ఉద్యమాలు కూడా  చేపట్టిన సంగతి తెలిసిందే.

ఎవరీ సోనమ్‌  వాంగ్‌చుక్
1966లో ఆల్చి స‌మీపంలోని ఉలేటోక్పోలో పుట్టారు సోనమ్‌.విద్యాభ్యాసం కోసం వసతుల్లేక  1977లో ఢిల్లీకి  తరలిపోయాడు.  ఇంజ‌నీరింగ్‌ విద్యను పూర్తి చేసి 2011లో ఫ్రాన్స్‌లో ఎర్త్ ఆర్కిటెక్చ‌ర్ ను అధ్య‌య‌నం  చేశారు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ ల‌డాగ్స్ మెలాంగ్ ప‌త్రిక‌కు ఎడిట‌ర్‌గా పనిచేశారు.  అలాగే 2018లో రామ‌న్ మెగ‌సెసే అవార్డు , ఐసీఏ, సోష‌ల్ ఎంట్ర‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయ‌ర్, రోలెక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ టెర్రా అవార్డుతో పాటు ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు ఆయన దక్కించుకున్నారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)