Breaking News

50 దాటాక కొందరిలో ప్రోస్టేట్‌ గ్రంథి పెరుగుతుంది ఎందుకు?

Published on Tue, 12/31/2024 - 12:07

మనిషి పుట్టుకకు ప్రోస్టేట్‌ గ్రంధి ఎంత కీలకం అంటే అది లేకపోతే మానవ మనుగడే లేదు. వృషణాలు వీర్యకణాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే అవి ఈదుతూ స్త్రీ అండం వరకు వెళ్లేందుకు తోడ్పడే ద్రవాన్ని మాత్రం ప్రోస్టేట్‌ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. వీర్యకణాలు మహిళ అండాలను చేరేవరకు వీర్యకణాలు నశించిపోకుండా... ఆ ద్రవంలోని ప్రోటీన్లూ, ఎంజైములూ, గ్లూకోజూ, కొన్ని కొవ్వులు సాయపడుతుంటాయి. ఇక మహిళల శరీరంలో కాస్త ఆమ్లగుణం ఉండటం వల్ల... దాన్ని న్యూట్రలైజ్‌ చేసేలా ప్రోస్టేట్‌ ద్రవం కాస్త క్షారగుణం కలిగి ఉంటుంది. దాంతో ప్రోస్టేట్‌ ద్రవంలోని క్షారగుణం... మహిళ శరీర ఆమ్లగుణాన్ని తట్టుకుని, వీర్యకణాల మనుగడ సాధ్యమయ్యేలా చేసి, వాటిని గమ్యానికి చేరుస్తాయి. దాంతో వీర్యకణంతో కలిశాక అండం పిండమై అదే చిన్నారి శిశువుగా రూపొందుతుంది. అయితే చాలామందిలో 50 ఏళ్లు దాటాక ఈ గ్రంథి సైజు దాదాపు అకస్మాత్తుగా పెరిగే అవకాశముంది. అప్పుడు వచ్చే సమస్యలూ, వాటి పరిష్కారాలూ తెలుసుకుందాం.  

ప్రోస్టేట్‌ గ్రంథి బాదం కాయ సైజులో దాదాపు 18–22 గ్రాముల బరువుంటుంది. ఈ గ్రంథి మధ్య నుంచే మూత్రాన్ని బయటకు తీసుకువచ్చే నాళం ఉంటుంది. వయసు పెరిగిన వాళ్లలో హఠాత్తుగా ప్రోస్టేట్‌ గ్రంథి పెరగడంతో ఆ నాళం ఒత్తుకుపోవడం వల్ల  మూత్రం బయటకు వచ్చే దారి మూసుకుపోతుంది. దాంతో మూత్రం బయటకు రాలేకపోడంతో కడుపు ఉబ్బిపోతున్నట్లుగా అనిపించడం... మూత్ర విసర్జనకు వెళ్తే అది బయటకు రాకపోవడంతో పురుషులు విలవిలలాడుతుంటారు. 

మునుపెన్నడూ ఇలా జరగకపోవడంతో మూత్రం వస్తున్నట్లు అనిపించడం, తీరా విసర్జనకు వెళ్తే రాక΄ోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు లోనవుతుంటారు. ఇలా బాధపడేవాళ్లను ఆసుపత్రికి తీసుకెళ్తే... డాక్టర్లు అక్కడ మూత్రనాళంలోకి ఒక పైప్‌ను ప్రవేశపెట్టి  లోపలున్న మూత్రాన్ని బయటకు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత పెద్దదిగా పెరిగిపోయిన ప్రోస్టేట్‌కు గ్రంథికి అవసరమైన చికిత్స అందిస్తారు.

ఒక పెరుగుదల హానికరం... 
మరొకటి నిరపాయకరం... 
ప్రోస్టేట్‌లోని పెరుగుదల రెండు రకాలుగా చెప్పవచ్చు. ఎలాంటి హానికరమైన మార్పులు లేని కణాలతో సైజు పెరగడాన్ని‘బినైన్‌ ప్రోస్టేటిక్‌ హైపర్‌ప్లేసియా’ అంటారు. దీని వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండబోదు. 

ఇక రెండో రకమైన పెరుగుదలను ప్రమాదకరమైనది పరిగణిస్తారు. ఇందులో ఈ పెరగుదల కేన్సర్‌ కణాలతో జరుగుతుంది. ప్రోస్టేట్‌ కేన్సర్‌ కారణంగా ఆ కణంలో అపరిమితంగా కణవిభజన జరగడంతో ఈ పెరుగుదల సంభవిస్తుంది.

స్టోరేజ్‌కు సంబంధించినదీ... 

  • రాత్రివేళలల్లో మామూలు కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుండటం.

  • పగటివేళల్లో కూడా చాలా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. 

  • మూత్రాన్ని ఏమాత్రం ఆపుకోలేకపోవడం. 

  • మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం.

వాయిడింగ్‌...  

  • మూత్రవిసర్జన కోసం నిలబడ్డ తర్వాత ఎంతోసేపటి తర్వాత గాని మూత్రపు ధార మొదలుకాకపోవడం. 

  • ధార సాఫీగా కాకుండా... చాలా మెల్లగా రావడం. 

  • మూత్రపు సంచి (బ్లాడర్‌) ఖాళీ కావడానికి చాలా సమయం తీసుకోవడం. 

  • మూత్రం... ఓ ధారలా కాకుండా... వస్తూ, ఆగుతూ... వస్తూ, ఆగుతూ  వస్తుండటం.

  • ఎప్పటిలా కాకుండా మూత్రవిసర్జన చాలా శ్రమతోనో, బాధతోనో జరుగుతుండటం, మూత్రవిసర్జనలో నొప్పి రావడం. 

  • మూత్రవిసర్జన ముగిసే సమయానికి ముక్కి ముక్కి పోయాల్సిరావడం. 

  • ఎంతో కొంత మూత్రం లోపలే ఉండిపోయినట్లు అనిపిస్తుండటం. 

  • ఒక్కోసారి మూత్రపు ధారలో రక్తం కనిపించడం (మూత్రంలో లేదా బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది).

ప్రోస్టేట్‌ సమస్యల నివారణ కోసం...  

ప్రోస్టేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ నివారణ మన చేతుల్లో లేకపోయినా... కొన్ని మామూలు జాగ్రత్తలతో ప్రోస్టేట్‌ సమస్యలను చాలావరకు నివారించవచ్చు. అవి... 

  • మూత్రవిసర్జన ఫీలింగ్‌ రాగానే... చాలాసేపు ఆపుకోకుండా వీలైనంత త్వరగా మూత్రవిసర్జనకు వెళ్లడం. 

  • మూత్రవిసర్జన కోసం ముందుగా నిర్ణయించుకున్న కొన్ని నిర్దిష్ట వేళల్లో... మూత్రం వచ్చినా రాకున్నా ఆ సమయంలో మూత్రవిసర్జనకు వెళ్లడం. 

  • కెఫిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులూ, కాఫీ వంటివి తీసుకోకపోవడం లేదా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం. 

  • రోజూ సాధారణంగా తాగే నీళ్లకు మించి... మరీ ఎక్కువగా మరిన్ని నీళ్లు తాగకపోవడం. 

  • డాక్టర్‌ సలహా లేకుండా అలర్జీల కోసం / ఊపిరితిత్తుల్లోకి గాలి సాఫీగా ప్రవహించేలా చేసే డీ–కంజెస్టెంట్స్‌ లేదా యాంటీహిస్టమైన్‌ మందులు తీసుకోక΄ోవడం. ఇవి బినైన్‌ ప్రోస్టేటిక్‌ హైపర్‌ప్లేసియా ముప్పును పెంచే అవకాశం ఉంది. 

  • చాలా చల్లని వాతావరణంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడం (చలి 
    వాతావరణం ఈ సమస్యను మరింత పెంచుతుంది). 

  • చురుగ్గా ఉండటం. అలా ఉండటం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.

  • శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం / ఒత్తిడిని అధిగమించడం (ఒత్తిడి వల్ల మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాలనిపిస్తుంటుంది). 

చికిత్స... 
ప్రోస్టేట్‌ వచ్చిన సమస్య, పెరుగుదలకు కారణం, దాని తీవ్రతా, లక్షణాలూ... అలాగే ఆ సమస్య వల్ల బాధితులు రోజువారీగా ఎదుర్కొనే సమస్యలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు... 

ప్రోస్టెటైటిస్‌ : ప్రోస్టేట్‌ గ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను ప్రోస్టెటైటిస్‌ అంటారు. మిగతా అన్ని రకాల ఇన్ఫెక్షన్‌ల లాగే... యాంటిబయాటిక్స్‌తో చికిత్స చేస్తే ఇది పూర్తిగా నయమవుతుంది. కాకపోతే యాంటిబయాటిక్స్‌తో కాస్త ఎక్కువ కాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది. 

మూత్రం ఏమాత్రం ఆపుకోలేక΄ోవడం, మూత్రంలో ఎరుపు కనిపించడం, మూత్రధారలో రక్తపు చారిక, మూత్రం లోపలే ఉండిపోవడం, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్లూ, కిడ్నీ దెబ్బతినడం వంటి సమస్యలను మందులతో అదుపు చేయలేకపోతే... అప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. 

ప్రోస్టేట్‌ పెరిగిన పరిమాణం, దాని ఆకృతి వంటి అంశాలను బట్టి వేర్వేరు రకాల ప్రక్రియలు (ప్రోసిజర్స్‌) అవసరమవుతాయి. వీటన్నింటిలో బినైనప్రోస్టేటిక్‌ హైపర్‌ప్లేసియా సమస్య కోసం సాధారణంగా ‘ట్రాన్స్‌ యురెథ్రల్‌ రిసెక్షన్‌ ఆఫ్‌ ప్రోస్టేట్‌’ (టీయూఆర్‌పీ) అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరిస్తుంటారు. 

మరికొందరిలో లేజర్‌ సహాయంతో ‘లేజర్‌ ప్రోస్టెక్టమీ’ చేస్తుంటారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో ΄ోలిస్తే... రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతున్నవారికీ, ప్రోస్టేట్‌ సైజు మరీ విపరీతంగా పెరిగినవారికీ, గుండె సమస్యలున్నవారికీ లేజర్‌ సహాయంతో చేసే చికిత్స వల్ల ప్రయోజనాలుంటాయి. ఉదాహరణకు ఠి చాలా స్వల్పంగా మాత్రమే రక్తస్రావం 

హాస్పిటల్‌లో ఉండాల్సిన వ్యవధి చాలా తక్కువ కావడం ఠి త్వరగా కోలుకోవడం వంటివి. 
పైన పేర్కొన్న లక్షణాలను బట్టి మూత్రవిసర్జన కోసం మూత్రవిసర్జన కోసం  టాయెలెట్‌లో గడపాల్సిన సమయం పెరుగుతుంటే  ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకుని, అవసరాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవడం మేలు.  

ప్రోస్టేట్‌ సైజు పెరిగేదెందుకు?

కొందరిలో ప్రోస్టేట్‌ గ్రంథి సైజు ఎందుకు పెరుగుతుందనేందుకు కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. వయసు పెరగడం వల్ల వచ్చే ఓ పరిణామంగా దాన్ని పరిగణిస్తుంటారు. ఓ వయసు దాటాక వెంట్రుకలు తెల్లబడటం ఎలాగో...ప్రోస్టేట్‌ సైజ్‌ పెరగడం కూడా అలాగేనని కొందరు నిపుణల అభిప్రాయం. ఒక వయసు దాటాక వృషణాల్లోని కణాలూ, వాటి నిర్మాణంలో వచ్చే మార్పులతోపాటు అవి ఉత్పత్తి చేసే టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ స్థాయుల మార్పుల వల్ల ప్రోస్టేట్‌ కూడా పెరుగు తుందేమోనన్నది కొందరు నిపుణుల భావన.

లక్షణాలు... 

ప్రోస్టేట్‌ పెరుగుదలలో రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది స్టోరేజీ... అంటే మూత్రం భర్తీ కావడంతో కనిపించే లక్షణాలు. రెండోది వాయిడింగ్‌... అంటే మూత్రపు సంచి (బ్లాడర్‌) ఖాళీ అవడానికి సంబంధించిన లక్షణాలు. 

నిర్ధారణ...

  • సమస్య నిర్ధారణ కోసం డాక్టర్లు తమ వేళ్లను మల మార్గం ద్వారా లోనికి ప్రవేశపెట్టి వేళ్ల స్పర్శ సహాయంతో ప్రోస్టేట్‌ పెరిగినదీ, లేనిదీ తెలుసుకుంటారు. దీన్నే ‘డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌’ (డీఆర్‌ఈ) అంటారు. 

  • మైక్రోస్కోప్‌ సహాయంతో మూత్రపరీక్ష (దీంతో ఏవైనా ఇన్ఫెక్షన్స్‌ ఉంటే తెలుస్తాయి). ఠి యూరిన్‌ కల్చర్‌ 

  • మూత్ర వేగం (యూరనరీ ఫ్లో  / యూరోఫ్లోమెట్రీ) ఠి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ (ఈ పరీక్ష వల్ల మూత్రపిండాలు, యురేటర్‌ (మూత్రపిండం నుంచి మూత్రపు సంచి వరకు ఉండే ట్యూబ్‌) , మూత్రపు సంచి (బ్లాడర్‌)ల పరిమాణంతోపాటు మూత్రపు సంచిలో మూత్రం మిగిలిపోతోందా అన్న విషయాలు తెలుస్తాయి). 

  • బ్లడ్‌ యూరియా, క్రియాటినైన్‌ పరీక్షలు. 

(చదవండి: ట్రా'వెల్‌నెస్‌' టిప్స్‌..! ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)