Breaking News

దీక్ష... దక్షత

Published on Mon, 09/22/2025 - 00:46

అది కార్తీక మాసం. ఊర్లో చాలామంది అయ్యప్ప దీక్షలో ఉన్నారు. వారందరినీ చూసిన ఓ యువకుడికి కూడా అయ్యప్ప మాల ధరించాలనిపించింది. అనుకున్నదే తడవుగా శివాలయం వద్ద ఉన్న గురుస్వామి గుర్తుకు వచ్చాడు. అన్నీ సిద్ధం చేసుకుని మాలధారణకు బయలుదేరాడు. అదే సమయంలో  గురుస్వామి గుడి పక్కనున్న నదిలో స్నానం చేస్తూ కనిపించాడు. ఆ యువకుడు ఒడ్డున నిలబడి నమస్కరించి ‘‘స్వామీ, నాకు కూడా అయ్యప్ప మాల వేయాలని ఉంది. అయితే నలభై రోజుల మండల దీక్ష చేయలేను. రెండు వారాలు మాత్రమే మాల ధరిస్తాను’’ అని చెప్పాడు. కారణమేమిటని అడిగాడు గురుస్వామి.

‘‘నాకు చన్నీళ్ళ స్నానం అంటే భయం. అందుకని నలభై రోజులు ఉండలేను’’ అని బదులిచ్చాడు యువకుడు. ‘‘అదేమీ లేదు, కొన్నాళ్ళు చన్నీళ్ళ స్నానం చేస్తే అదే అలవాటైపోతుంది’’అని ధైర్యం చెప్పాడు గురుస్వామి. అది అసాధ్యం అన్నట్లుగా ముఖం పెట్టాడు యువకుడు. ‘‘సరే, నేను చెప్పినట్లు చేస్తావా?’’ అని అడిగాడు గురుస్వామి.

‘‘చన్నీళ్ళ స్నానం తప్పితే మరే పని చేయమన్నా చేస్తాను’’ అని గట్టిగా చెప్పాడు ఆ యువకుడు. వెంటనే గురుస్వామి ‘‘నీ చేతి వేలు ఈ ప్రవహించే నదిలో పెట్టు!’’ అన్నాడు. అదెంత పని అన్నట్లుగా నీళ్ళలో వేలు పెట్టాడు. ఎలాగుందని అడిగాడు గురుస్వామి. చలిగా ఉందని సమాధానమిచ్చాడు యువకుడు. ఈసారి చేయి  మొత్తం నీళ్ళలో పెట్టమని కోరాడు. అలాగే మొత్తం చేయి పెట్టిన  యువకుడు భలే చలిగా ఉందని అరిచాడు. ‘ఈసారి గట్టు నుంచి నదిలోకి దూకు!’’ అన్నాడు.

ఎగిరి దుమికాడు యువకుడు. వెంటనే స్వామి చలి ఎలా ఉందని ప్రశ్నించాడు. ‘‘చలే లేదు స్వామీ! వెచ్చగా ఉంది!!’’ అని నీళ్ళలో ఈతకొడుతూ బదులిచ్చాడు యువకుడు. గురుస్వామి నవ్వుతూ ‘‘నిండా మునిగితే చలి లేదన్నారు పెద్దలు. రోజూ చన్నీళ్ళ స్నానం చేస్తే చలీగిలీ కనిపించవు. అలవాటయ్యాక చన్నీళ్ళ స్నానమే బాగుంటుందని అంటావు. చన్నీళ్ళ స్నానానికి భయపడి దీక్ష కాలాన్ని ఎందుకు తగ్గించుకుంటావు. దీక్ష ఫలితం పూర్తిగా ఆస్వాదించాలంటే నలభై రోజులు ఉంటేనే బాగుంటుంది’’ అని సలహా ఇచ్చాడు. అలాగేనని సంతోషంగా నలభై రోజుల దీక్షకు ఉపక్రమించాడు ఆ యువకుడు.
– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)