Breaking News

Eid-ul-Fitr 2025 దేవుని మన్నింపు రోజు

Published on Mon, 03/31/2025 - 11:16

ఈద్‌ (Eid-ul-Fitr 2025) అంటే పండుగ, ఫిత్ర్‌ అంటే దానం... వెరసి దానధర్మాల పండుగ అని అర్థం. అందుకే రమజాన్‌ నెలలో ముస్లిం సోదరులు దానధర్మాలు అధికంగా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. సదఖా, ఖైరాత్, జకాత్, ఫిత్రా... వంటి పేర్లతో పేదసాదలకు ఎంతో కొంత సహాయం చెయ్యాలని తద్వారా దైవ ప్రసన్నత పొందాలని ప్రయత్నిస్తుంటారు. 

ఇస్లాం ధర్మంలో దాతృత్వానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా రమజాన్‌లో దానధర్మాలు చేసే వారికి, స్వీకరించే వారికి కూడా మంచి ప్రతిఫలం లభిస్తుందని నమ్మకం.  నిజానికి రమజాన్‌ అన్నది సంవ త్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమెన పవిత్ర ఖురాన్‌ రమజాన్‌ లోనే అవతరించింది. అందుకే ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత  ఈ మాసా నికి ప్రాప్త మయ్యాయి. మానవుల శారీరక, మాన సిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాస వ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయ భక్తులు జనింప జేసి, మానవీయ విలువలను పెంపొందిస్తుంది. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. 

ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వ ప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్‌ నెల మొదటి తేదీన ముగింపు ఉత్సవంగా ‘ఈద్‌’ జరుపుకొంటారు. ఈరోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఈద్‌ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం. ఈద్‌ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇక ముందు తప్పులు చేయ మని, సత్యంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకొనే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపునకు మరలాలి.  

– మదీహా అర్జుమంద్‌
(ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినం సందర్భంగా...) 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)