ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో ఓ అద్భుతం ఫెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘నడా హఫేజ్’

Published on Thu, 08/01/2024 - 10:34

ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు పోటీ పడే విశ్వ క్రీడా వేదిక ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఏ రంగంలోనైనా రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలి. అయితే  తాము అనుకున్నది సాధించే క్రమంలో మహిళలు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు. ఈజిప్ట్ ఫెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడా హఫేజ్. ఆమె ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగారు. ఒలింపిక్‌ చరిత్రలో ఏడు నెలల గర్భిణి పోటీలో నిలవడం, అదీ టాప్‌  టెన్‌లో నిలవడం  విశేషంగా నిలిచింది.  

ఈ విషయాన్ని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ద్వారా స్వయంగా హఫేజ్‌ వివరించారు. జీవితం, క్రీడలు ప్రయాణం ఎంత శ్రమతో కూడుకున్నదో వివరించింది. ‘నేను లిటిల్ ఒలింపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోస్తున్నాను. శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న సవాళ్లలో మా ఇద్దరికీ సమాన వాటా ఉంది. జీవితం, ఆటను బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు పోరాడాల్సి వస్తోంది’ అంటూ తొలి రౌండ్ గెలిచిన తర్వాత 26 ఏండ్ల హఫేజ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలో పోస్ట్ చేసింది.

పోడియంపై మీకు ఇద్దరు ఆటగాళ్ళుగా కనిపిస్తున్నారు, వారు నిజానికి ఇక్కడ ముగ్గురున్నారు. అది నేను, నా పోటీదారు,  నా  చిన్న పాప! శారీరక, మానసిక శ్రమ సవాళ్లలో నాతోపాటు, ఆ చిన్నిపాపాయికి కూడా వాటా ఉంది. అంతేకాదు తన ఈ ప్రయాణంలో తన భర్త సహకారం కూడా ఏంతో ఉందని, తన ఫ్యామిలీ తనపై నమ్మకాన్ని ఉంచడం తన అదృష్టమని కూడా తెలిపింది. అలాగే ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై ఓపెనింగ్‌లో ఎలా విజయం సాధించిందో వివరించింది. టార్టకోవ్‌స్కీతో జరిగిన మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్‌లో హఫీజ్ 15-13తేడాతో తన మొదటి బౌట్‌ను గెలుచుకుంది, అయితే పారిస్ గేమ్స్‌లో 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో ఓడిపోయింది. గతంలో ఈజిప్ట్ తరపున 2016 , 2020 ఒలింపిక్స్‌లో సాబ్రే క్రీడలో పోటీ పడింది.

 

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)