Fashion: బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఈషా! ఆ బ్రాండ్‌ స్పెషాలిటీ?

Published on Mon, 01/09/2023 - 11:25

తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది తెలుగు హీరోయిన్స్‌లో ఈషా రెబ్బా ఒకరు. సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సెపరేట్‌ స్టయిల్‌ క్రియేట్‌ చేసుకున్న ఆమె.. ఫ్యాషన్‌లోనూ అంతే సెలెక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్రాండ్స్‌ ఈషా వార్డ్‌రోబ్‌లోనివే.. 

షామీన్‌ హుస్సేన్‌ 
మిమ్మల్ని మీరు ఒక ప్రిన్సెస్‌లా చూడాలనుకుంటున్నారా? అయితే, డిజైనర్‌ షామీన్‌ హుస్సేన్‌ కలెక్షన్స్‌ను ఒకసారి ట్రై చేయండి. దేశీ వెర్షన్‌లో అందమైన ఫ్లీ లెహంగాలు, గౌన్లు తయారుచేయడంలో షామీన్‌ స్పెషలిస్ట్‌.  

స్టైలిష్‌ లుక్‌నిచ్చే ఈ డిజైన్స్‌ను సెలబ్రిటీలు సైతం ఇష్టపడతారు. చిన్న పిల్లలక్కూడా ఈ డిజైన్స్‌ లభిస్తాయి. స్పెషల్‌గా ఆర్డర్‌ ఇచ్చి డిజైన్‌ చేయించుకునే వీలూ ఉంది. ఆన్‌లైన్‌ స్టోర్‌లో మాత్రమే లభ్యం. 

ఛగన్‌లాల్‌ జ్యూయెల్స్‌
1956లో ఛగన్‌లాల్‌ జ్యూయెల్స్‌ ప్రారంభమైంది. మొదట వీరు కేవలం రాజకుటుంబీకులకు మాత్రమే ఆభరణాలను తయారుచేసేవారట. తర్వాత సామాన్యులు కూడా వీరి ఆభరణాలను ధరించాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

ఇక్కడ లభించే ఆభరణాల డిజైన్స్‌ ఎక్కువగా ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. 

బ్రాండ్‌ వాల్యూ
జ్యూయెలరీ
బ్రాండ్‌: ఛగన్‌లాల్‌ జ్యూయెల్స్‌
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

డ్రెస్‌ బ్రాండ్‌: షామీన్‌ హుస్సేన్‌ 
ధర: రూ. 35,018

నన్ను కొంతమంది ‘తెల్లగా ఉండుంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేసేదానివి’ అన్నారు. అలాంటి అభిప్రాయలను నమ్మను.. ఆ మాటలను ఖాతరు చేయను. మేని ఛాయ.. ప్రతిభను కమ్మేయదు.   ఈషా రెబ్బా 
-దీపికా కొండి

Videos

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

బ్రెజిల్ సముద్రంలో కూలిపోయిన విమానం.. పైలట్ మృతి

వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు

Photos

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)